|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లెజెండరీ నటిగా అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్.. ఏ చిత్రానికో తెలుసా?

Published: 12-05-2025, 11:03 PM
లెజెండరీ నటిగా అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్.. ఏ చిత్రానికో తెలుసా?

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె అద్భుతమైన నటనకు అవార్డు అందుకుని సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేసింది.

Key Points

1

ఐశ్వర్య రాజేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అద్భుతమైన నటన ప్రదర్శించింది.

2

ఆమె అద్భుతమైన నటనకు అవార్డు లభించింది.

4

దర్శకుడు అనిల్ రావిపూడి మరియు జీ5 తెలుగుకు ఐశ్వర్య ధన్యవాదాలు తెలిపింది.

ఐశ్వర్య రాజేష్ కు అవార్డు

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అద్భుతమైన ప్రతిభ కనబర్చిందనడంలో అతిశయోక్తిలేదు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా భాగమై సూపర్ యాక్టింగ్‌తో ఇరగదీసింది.

ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 14న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం

అయితే తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేస్ అద్భుతమైన నటనకు తాజాగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన ఆ సంతోషాన్ని పంచుకుంది. ‘‘ కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. అలాగే కొన్ని పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేనివి భాగ్యం (సంక్రాతికి వస్తునం), నాకు ఇంత అద్భుతమైన పాత్రను ఇచ్చి..

సోషల్ మీడియా పోస్ట్

నన్ను ఇంత సులభంగా చేయించినందుకు అనిల్ రావిపూడికి నేను చాలా కృతజ్ఞుడను.. అది అనిల్ కాకపోతే నేను ఆ పాత్రను ఇంత బాగా చేసి ఉండేవాడిని కాదు. మళ్ళీ చాలా ధన్యవాదాలు అనిల్. నాకు అవార్డు ఇచ్చిన @zee5telugu కి, లెజెండరీ నటి జయప్రదకు ధన్యవాదాలు’’ అంటూ ఐశ్వర్య రాజేష్ ఇందుకు సంబంధించిన ఫొటోలు పంచుకుంటూ రాసుకొచ్చింది.

ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని తన పాత్రకు అవార్డు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఆమెకు అవార్డు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.