|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య సినిమాలో డస్కీ అందాల విందు! ఊహించని ట్విస్ట్.. మళ్ళీ మాస్ జాతరే!

Published: 29-03-2026, 7:35 AM
బాలయ్య సినిమాలో డస్కీ అందాల విందు! ఊహించని ట్విస్ట్.. మళ్ళీ మాస్ జాతరే!
  • బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది.
  • ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
  • రెండవ హీరోయిన్‌గా డింపుల్ హయతిని తీసుకునే అవకాశం ఉంది.
  • ముంబై నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాలో నయనతార హీరోయిన్‌గా ఎంపిక కాగా, డింపుల్ హయతి కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో రిపీట్!

Balakrishna:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహాగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు రాజకీయాలలో దూసుకుపోతున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడుసార్లు విజేత గా హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య. ఒకవైపు హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూనే.. అక్కడే సొంత నియోజకవర్గంలో సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకుంటున్నారు. ఒకవైపు ప్రజలకు చేరువలో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ మంచి నాయకుడిగా పేరు సొంతం చేసుకుంటున్న బాలయ్య ఇటు సినిమాల ద్వారా అభిమానులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటినా కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఈ క్రమంలోనే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మళ్లీ కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా బాలయ్య సరసన డస్కీ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

హీరోయిన్‌గా నయనతార ఫిక్స్.. మరో హీరోయిన్ ఎవరంటే?

అసలు విషయంలోకి వెళ్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతారను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెండవ హీరోయిన్గా డింపుల్ హయతిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇకపోతే ఈ సినిమా రెండవ భాగంలో డింపుల్ హయతి పాత్ర చాలా కీలకంగా ఉండనుంది అని సమాచారం. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా డింపుల్ హయతికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

డింపుల్ హయతికి ఛాన్స్.. నిజమెంత?

ఇకపోతే డింపుల్ హయతి విషయానికి వస్తే.. గతంలో రవితేజ ఖిలాడి సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. గద్దల కొండ గణేష్ చిత్రంలో జర్ర జర్ర అనే స్పెషల్ సాంగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఆ తర్వాత అడపా గడప సినిమాలు చేసింది. కానీ అవేవీ కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు. తర్వాత రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేసింది . సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఇక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ సినిమా ప్రమోషన్స్ లోనే తాను దాసరి నారాయణరావు మనవరాలు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ మరిప్పుడు బాలయ్య సినిమాతోనైనా మంచి సక్సెస్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

మొత్తానికి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డింపుల్ హయతి నటిస్తే సినిమాకు మరింత కలర్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.