
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ లేటు వయసులోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
- బాలయ్య తాజా చిత్రం అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఇది హిందీలోనూ విడుదలవుతోంది.
- చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల కంటే బాలయ్య ముందంజలో ఉన్నారని చర్చ నడుస్తోంది.
- బాలయ్య రీమేక్‌ల జోలికి వెళ్లకుండా, స్వంత కథలతో అభిమానులను ఆకట్టుకుంటూ విజయాలు సాధిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ లేటు వయసులోనూ వరుస విజయాలతో దూసుకుపోతూ, టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల కంటే ముందంజలో ఉన్న బాలయ్య, ‘అఖండ 2’ తో పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేశారు. ఆయన విజయ రహస్యం ఏంటి?
బాలయ్య వరుస విజయాల వెనుక రహస్యం
నందమూరి బాలకృష్ణ లేటు వయసులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. అఖండ 2 చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంతో బాలయ్య పాన్ ఇండియా మార్కెట్ పై కూడా కన్నేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్లంతా వెనుకబడి ఉన్నారు. బాలయ్య మాత్రం హిట్ల మీద హిట్లు కొడుతున్నారు.
బాలకృష్ణ నటించిన చివరి నాలుగు చిత్రాలు విజయాలే. ఇంత కన్సిస్టెంట్ గా బాలయ్య కెరీర్ ఎప్పుడూ లేదు. అఖండ 2 కనుక విజయం సాధిస్తే బాలయ్య మార్కెట్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోవడం ఖాయం. యువ హీరోల ప్రభావం పెరిగినప్పుడు సీనియర్ల జోరు తగ్గడం సహజమే. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ల జోరు కాస్త తగ్గింది. వేళ్ళు అప్పుడప్పుడూ హిట్లు కొడుతున్నారు కానీ కన్సిస్టెన్సీ మైంటైన్ చేయడం లేదు.
సీనియర్ హీరోల జోరు ఎందుకు తగ్గింది?
కానీ వీరి ముగ్గురు కంటే బాలయ్య ముందంజలో ఉన్నారు. గతంలో బాలయ్య రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కంటే బాలయ్య ఎలా వరుస హిట్లు అందుకుంటున్నారు అనే చర్చ మొదలైంది.
బాలయ్య ఇప్పుడు కూడా చేస్తున్నది మాస్ సినిమాలే. ఈ చిత్రాల్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి. కానీ వాటిని పక్కాగా ఉండేలా, అభిమానులకు నచ్చేలా బాలయ్య చూసుకుంటున్నారు. బాలయ్యకు ప్రధాన బలం ఏంటంటే.. రీమేక్ ల జోలికి వెళ్లడం లేదు. చిరంజీవి చివరి నాలుగు చిత్రాల్లో 2 రీమేక్ లు ఉన్నాయి. గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండు చిత్రాలు రీమేక్ లే. అవి పూర్తిగా నిరాశ పరిచాయి.
అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా ప్లాన్స్
వెంకటేష్ చివరగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. అంతకు ముందు తన ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాని సైంధవ్ మూవీతో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. నాగార్జున అయితే హీరోగా కనిపించి చాలా కాలం అవుతోంది. ఇటీవల నాగార్జునకి సరైన హిట్ లేదు. సీనియర్లు తడబడుతున్న సమయంలో బాలయ్య ఒక్కడే దూసుకుపోతున్నాడు.
మొత్తంగా, సీనియర్ హీరోలు తడబడుతున్న వేళ, బాలయ్య ఒక్కడే నిలకడగా విజయాలు సాధిస్తూ టాప్‌లో ఉన్నారు. ‘అఖండ 2’ విజయం సాధిస్తే ఆయన మార్కెట్ మరింత ఉన్నత స్థాయికి చేరడం ఖాయం, ఇది టాలీవుడ్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.


