|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీరు మాట కూడా జారారు- ఎలిమినేట్ అయిన మనీష్ మర్యాదతో హీరో శివాజీ- బిగ్ బాస్ బజ్‌లో ఒప్పుకున్న కామనర్

Published: 22-09-2025, 1:32 AM
మీరు మాట కూడా జారారు- ఎలిమినేట్ అయిన మనీష్ మర్యాదతో హీరో శివాజీ- బిగ్ బాస్ బజ్‌లో ఒప్పుకున్న కామనర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యాడు. అతనితో హీరో శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ ఇంటర్వ్యూలో మనీష్ ఇతర కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

Key Points

1

బిగ్ బాస్ 9 నుండి మనీష్ మర్యాద ఎలిమినేట్.

2

శివాజీ చేసిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మనీష్ పాల్గొన్నాడు.

4

మనీష్ తన ఓవర్ కాన్ఫిడెన్స్‌ను ఒప్పుకున్నాడు.

మనీష్ మర్యాద ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 సందడి కొనసాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఈ వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిసిందే. అలా ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 బజ్‌కు హోస్ట్‌గా హీరో, సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించారు.

ఇక హౌజ్‌లోకి కామనర్‌గా వచ్చిన మనీష్ మర్యాద బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారం ఎలిమినేట్ అయ్యాడు. అతన్ని బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. “ఫైరు ఎవరు ఫ్లవర్ ఎవరు” అని హౌజ్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ గురించి అడిగాడు శివాజీ. డీమోన్ ఫ్లవర్ అని చెప్పిన మనీష్ “టాప్ 7 మెటీరియల్ కానీ, ఎందుకో ఒక టైమ్‌లో వెళ్లిపోతారని కొడుతుంది కొంచెం” అని చెప్పాడు.

శివాజీతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ

“తన వల్ల గేమ్ ఇప్పటికీ ఇంపాక్ట్ అవ్వలేదు” అని తనూజ గౌడ గురించి చెప్పాడు మనీష్. తర్వాత “ఇతను 3 విషయాలు బాగా మ్యానేజ్ చేస్తాడు. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్, సెకండ్ ఎమోషన్స్, థర్డ్ టాస్క్. ఇంకేం కావాలి సర్” అని జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ గురించి గొప్పగా చెప్పాడు మనీష్ మర్యాద.

“హౌజ్ నుంచి వచ్చాక ప్రియా గురించి మీ అభిప్రాయం ఏంటీ” అని శివాజీ అడిగాడు. “నేను అయితే హౌజ్‌లో ఉంటే వచ్చే వారం నామినేట్ చేసేవాన్ని” అని మనీష్ అన్నాడు. “మీ దగ్గర మాటలు చాలా ఉన్నాయని మాకు తెలుసు. కానీ, మీరు మాట కూడా జారారు” అని శివాజీ అన్నాడు.

మనీష్ యొక్క అభిప్రాయాలు మరియు ఒప్పుకోలు

“ఎందుకో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా బిహేవ్ చేస్తున్నాడనిపించింది” అని శివాజీ అంటే.. “నేను కూడా నోటీస్ చేశాను” అని తప్పు ఒప్పుకున్నాడు మనీష్. “మీ దగ్గర యూనిటీ ఉందా. ఉంటే ఎవరెవరితో ఎవరెవరికి ఉంది. మీరు శ్రీజ, ప్రియ ఇంత చేయడం వల్ల ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టారు అక్కడ” అని శివాజీ అన్నాడు.

“యాక్చువల్‌గా నేను ఫైరుగా ఉండి వైల్డ్ ఫైర్ చేశానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది” అని నవ్వాడు మర్యాద మనీష్. అంతటితో తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 9 తెలుగు బజ్ ప్రోమో ముగిసింది.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మనీష్ మర్యాద తన గేమ్‌ప్లే, ఇతర పోటీదారుల గురించి తెలిపాడు. తన తప్పులను ఒప్పుకుంటూ, అతని ఓవర్ కాన్ఫిడెన్స్‌ను గుర్తించాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.