
📌 Key Points
- రోహిణి తన ‘మాన్’తో ఫోటో షేర్ చేయడంతో వైరల్ అవుతున్న పోస్ట్!
- చాట్ జీపీటీ ద్వారా క్రియేట్ చేసిన వ్యక్తితో రోహిణి ఫోటో దిగడం హాట్ టాపిక్!
- నెటిజన్ల నుండి రోహిణికి వస్తున్న కంగ్రాట్స్, ఫన్నీ కామెంట్స్!
- బిగ్ బాస్ తర్వాత రోహిణి ఫుల్ బిజీ.. టీవీ షోస్, సినిమాలతో సందడి!
జబర్దస్త్ రోహిణి సంచలన పోస్ట్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రోహిణి ‘నా మ్యాన్’ అంటూ ఫోటో షేర్..!
జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ రోహిణి ఒకరు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటది. ఏ క్యారెక్టర్ అయినా సరే ఇట్టే లీనమైపోయి బాగా నవ్వించడానికి ట్రై చేస్తుంది. అలా జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఏకంగా రెండు సార్లు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా సందడి చేసింది. అయితే మొదటిసారి కంటే రెండోసారి బిగ్‌బాస్ చాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్, పాపులారిటీ వచ్చింది. గతేడాది బిగ్‌బాస్ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది రోహిణి. బిగ్ బాస్ 8వ సీజన్‌లో దాదాపు 9 వారాల పాటు హౌస్‌లో ఉండి బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించింది.
నెటిజన్ల నుండి కంగ్రాట్స్ వెల్లువ!
అలాగే తన ఆట, మాట తీరుతో మరెంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోహిణి మరింత బిజీగా మారిపోయింది. వరుసగా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తున్న ఆమె మరోవైపు అప్పుడప్పుడు సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ కనిపిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చాట్ జీపీటీతో రోహిణి న్యూ ట్రెండ్!
తాజాగా రోహిణి తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో హ్యాండ్ సమ్ లుక్‌లో ఉన్నఓ వ్యక్తికి చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘ఫైనల్లీ నా మ్యాన్‌ను కలిశాను.. CHATGPT నుండి….ధన్యవాదాలు.. నువ్వు నాకు ఒక అందమైన మనిషిని ఇచ్చావు’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ రియల్‌గా కూడా నీకు ఇంతకంటే ఎక్కువ హ్యాండ్ సమ్ ఉన్న వ్యక్తి భర్తగా వస్తాడంటూ నెటిజన్లు, సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మధ్య చాట్ జీపీటీను యూస్ చేసి ఇలా ఫొటోస్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రోహిణి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. అప్పటివరకు వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


