
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం అగ్ని పరీక్ష నిర్వహిస్తున్నారు. అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా వ్యవహరిస్తూ, 100 మందికి పైగా అప్లికేషన్ల నుండి 15 మందిని ఎంపిక చేశారు. అయితే, అభిజీత్ ఒక లేడి కంటెస్టెంట్ తో గొడవ పడ్డాడని వార్తలు.
Key Points
బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష ప్రారంభం
అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా
13 ఎపిసోడ్ల అగ్ని పరీక్ష జియో హాట్‌స్టార్‌లో
అగ్ని పరీక్ష: కంటెస్టెంట్ల ఎంపిక
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఏ సీజన్‌లో రాని విధంగా కామన్ కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే మొదటిసారిగా ఓపెనింగ్‌కు ముందే ప్రీ షో జరగనుంది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష.
బిగ్ బాస్ తెలుగు 9 లో కామన్ ఆడియెన్స్‌ను కంటెస్టెంట్లను పంపించేందుకు నిర్వహించేదే ఈ అగ్ని పరీక్ష. బిగ్ బాస్ 9 తెలుగు అగ్ని పరీక్ష కోసం మొత్తంగా 100 మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకోగా.. వారిలో వడబోతలు చేసి 15 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 15 మందికి అసలైన అగ్ని పరీక్ష టాస్క్‌ను పెట్టనున్నారు బిగ్ బాస్ మేకర్స్.
అయితే, ఈ బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష కోసం ముగ్గురు జడ్జ్‌లను నియమించారు. వారే బిగ్ బాస్ పాత సీజన్స్ విన్నర్స్ అయిన అభిజీత్, బిందు మాధవి , హీరో నవదీప్ . నిజానికి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఈ ముగ్గురు ముగ్గురే. ఈ ముగ్గురు నిర్వహణలో చివరిగా ముగ్గురుని ఫైనల్ చేసి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు కంటెస్టెంట్స్‌గా పంపించనున్నారు.
జడ్జీలు: అభిజీత్, బిందు మాధవి, నవదీప్
సెప్టెంబర్ 7న ప్రారంభం అయ్యే బిగ్ బాస్ 9 తెలుగు హౌజ్‌లోకి మిగతా సెలబ్రిటీలతోపాటు కామన్ మ్యాన్ కేటగిరీలో ఈ ముగ్గురు అడుగుపెడతారు. అయితే, ముగ్గురు న్యాయ నిర్ణేతలకు ఐదుగురు కేటాయిస్తారు. ఆ ఐదుగురు ఒక్కో జడ్జ్ నుంచి స్టార్ సాధించుకోవాలి. ముగ్గురి నుంచి స్టార్ దక్కించుకున్న వాళ్లే తదుపరి రౌండ్‌కు వెళ్తారు.
అలా వెళ్లగా ఫైనల్‌గా ఒక్కో జడ్డ్ టీమ్ నుంచి మిగిలే ఒక్కరే కంటెస్టెంట్‌గా మారుతారు. అయితే, ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ విన్నర్ అభిజీత్‌తో అగ్ని పరీక్ష లేడి కంటెస్టెంట్ గొడవ పడిందని సమాచారం. అగ్ని పరీక్ష సమయంలో సదరు లేడి కంటెస్టెంట్ ఓవర్ చేసిందని, అందుకే తనదైన స్టైల్‌లో అభిజీత్ ఆమెకు ఇచ్చి పడేశాడని టాక్ నడుస్తోంది.
అభిజీత్ – లేడి కంటెస్టెంట్ గొడవ
ఆగస్ట్ 22 నుంచి ఈ బిగ్ బాస్ 9 తెలుగు అగ్ని పరీక్ష ప్రసారం కానుంది. జియో హాట్‌స్టార్‌లో మొత్తం 13 ఎపిసోడ్స్ 13 గంటలపాటు బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్షను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా, ఈ అగ్ని పరీక్షకు అభిజీత్, బిందు మాధవి, నవదీప్‌లు న్యాయ నిర్ణేతగా ఉంటే యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా చేస్తోంది.
ఇక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీ లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది.
బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష 13 ఎపిసోడ్లతో జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన కంటెస్టెంట్లు సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమయ్యే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశిస్తారు.


