
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి నటించిన పరమపద సోపానం అనే థ్రిల్లర్ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. పూరి జగన్నాధ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Key Points
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్నారు.
పూరి జగన్నాధ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వం వహిస్తున్నారు.
జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
జూలై 11న థియేటర్లలో విడుదల కానుంది.
అర్జున్ అంబటి, జెన్నిఫర్ జోడి
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ఓ వైపు సినిమాలు చేస్తూనే టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఇటీవలే తెప్పసముద్రం, వెడ్డింగ్ డైరీస్ సినిమాలు చేసిన అర్జున్ అంబటి తాజాగా మరో వైరెటీ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
అర్జున్ అంబటి హీరోగా పరమపద సోపానం పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ శివ….పరమ పద సోపానం మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.
పూరి శిష్యుడి దర్శకత్వం
పరమ పద సోపానం మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిన్ని చిన్ని తప్పులేవో అనే పల్లవితో సాగిన ఈ పాటకు డేవ్ జాంద్ మ్యూజిక్ అందించాడు. రాంబాబు గోసాల రాసిన ఈ పాటను పృథ్వీ చంద్ర, అదితి బావరాజు ఆలపించారు. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌కు అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమాన్యుయేల్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. దేవ్ జాంద్ గతంలో రవితేజ ఈగల్ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
జూలై 11న పరమ పద సోపానం మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు డైరెక్షన్‌తో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా నాగ శివ అందిస్తోన్నారు. డిఫరెంట్ థ్రిల్లర్‌గా పరమ పద సోపానం ప్రేక్షకులను మెప్పిస్తోందని నిర్మాత గుడిమిట్ల శివప్రసాద్ అన్నారు. అర్జున్ అంబటికి హీరోగా మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు.
రొమాంటిక్ సాంగ్ విడుదల
టైటిల్ పరమ పద సోపానం అని ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తునే అర్థమవుతుందని పేర్కొన్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఫైనల్ చేరుకున్న అర్జున్ అంబటి టాఫ్ ఫైవ్ కంటెస్టెంట్‌లో ఒకరిగా నిలిచాడు. తెలుగులో తెప్ప సముద్రంతో పాటు సుందరి, వెడ్డింగ్ డైరీస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. హరికథ, అగ్నిసాక్షి వెబ్‌సిరీస్‌లలో అర్జున్ అంబటి డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. బిగ్‌బాస్ బజ్‌తో పాటు పలు టీవీ షోస్‌కు హోస్ట్‌గా ఆకట్టుకున్నాడు.
చివరగా, పరమపద సోపానం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు జూలై 11న విడుదల కానుంది. అర్జున్ అంబటికి మంచి పేరు తెస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.


