
📌 Key Points
- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తుది దశకు చేరుకుంది, ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది.
- విజేతగా కళ్యాణ్, రన్నరప్‌గా తనూజ నిలిచారంటూ వికీపీడియాలో అప్‌డేట్ సంచలనం సృష్టించింది.
- వికీపీడియా ఎవరైనా సవరించగలిగే ఓపెన్ సోర్స్ వేదిక కావడంతో ఈ లీక్‌పై అనుమానాలున్నాయి.
- హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించే వరకు విజేత ఎవరనేది ఉత్కంఠగానే ఉండనుంది.
తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 9 సీజన్ తుది దశకు చేరుకుంది. విజేత ఎవరనే చర్చ నడుస్తుండగా, వికీపీడియాలో బిగ్ బాస్ 9 విన్నర్‌ను లీక్ చేశారనే వార్త కలకలం రేపుతోంది. దీనిపై అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే చదవండి.
బిగ్ బాస్ 9 విన్నర్‌పై ఉత్కంఠ
తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ బిగ్ బాస్ 9 సీజన్ కొనసాగుతోంది. ఇక, కేవలం ఒక్క రోజులోనే ఎండ్ కార్డ్ పడబోతుంది. కాబట్టి ఈ సీజన్ మొత్తం డ్రామా, ఎమోషన్స్, ట్విస్టులు, అనూహ్య పరిణామాలతో కొనసాగింది. అలాంటి బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌పై జరుగుతున్న ప్రచారాలు రోజురోజుకు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
అది ఏంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత ప్రకటనకు ముందే సోషల్ మీడియాలో వికీపీడియా అప్‌డేట్ కలకలం రేపుతోంది. విజేతగా కళ్యాణ్, రన్నరప్‌గా తనూజ నిలిచారంటూ వికిపీడియాలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే వికీపీడియా ఎవరైనా సవరించగలిగే(ఓపెన్ సోర్స్) వేదిక కావడంతో ఎవరో కావాలనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యానికి వికీపీడియాకు ఎలాంటి అధికారిక సంబంధం లేదు. అయితే అధికారిక ప్రకటన రాకముందే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించే వరకు విజేత ఎవరనేది ఉత్కంఠగానే ఉండనుంది.
వికీపీడియా లీక్: అసలు నిజమెంత?
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
వికీపీడియాలో విజేత పేరు కనిపించినా, ఇది అధికారికం కాదు. హోస్ట్ నాగార్జున స్వయంగా ప్రకటించే వరకు బిగ్ బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఓ ఉత్కంఠభరిత రహస్యంగానే ఉండనుంది. అప్పటివరకు ఈ ప్రచారంపై నమ్మకం వద్దు.


