|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్ బద్దలు: ‘బైకర్’కు బ్రేకులు, ‘రాకాస’కు షాక్! శర్వానంద్, సంగీత్ పరిస్థితి ఏమిటి?

Published: 06-04-2026, 1:05 PM
బాక్సాఫీస్ బద్దలు: 'బైకర్'కు బ్రేకులు, 'రాకాస'కు షాక్! శర్వానంద్, సంగీత్ పరిస్థితి ఏమిటి?
  • ‘బైకర్’ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో కూరుకుపోయారు.
  • ఐపీఎల్ మ్యాచ్‌ల కారణంగా ఆదివారం థియేటర్లకు ప్రేక్షకులు రాలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
  • శర్వానంద్ సొంతంగా పెట్టుబడి పెట్టడం, యువీ క్రియేషన్స్ సినిమా కావడంతో ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు.
  • సంగీత్ శోభన్ నటించిన ‘రాకాస’ చిత్రం పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు.

సమ్మర్ సీజన్ లో విడుదలైన ‘బైకర్’, ‘రాకాస’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ, వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలపాలయ్యారు.

‘బైకర్’ సినిమాకు భారీ నష్టం

Box Office : ఈ సమ్మర్ సీజన్ అయినా సాలిడ్ గా స్టార్ట్ అవుతుందనుకుంటే బైకర్,రాకాసల రూపంలో మొదటి వారంలోనే గట్టి దెబ్బ తగిలినట్టు కనిపిస్తుంది. నిజానికి ఈ రెండు సినిమాలపై బజ్ బాగానే ఉండటంతో డీసెంట్ కలెక్షన్స్ అయినా రాబట్టకపోతాయా అని ఆశ పడింది బాక్సాఫీస్. కానీ అబ్బే అంతా సీన్ లేదన్నట్టు వచ్చిన వీకెండ్ లోనే చేతులు ఎత్తేసిన పరిస్థితి. వాస్తవానికి  ఆదివారం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని ఆశించిన  మేకర్స్ కి  ఐపీఎల్ రూపంలో పెద్ద షాకే  తగిలింది. సన్ రైజర్స్, సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ లాంటి క్రేజీ టీమ్స్ మధ్య మ్యాచ్‌లు ఉండటంతో ఆడియన్స్ థియేటర్ల వైపు అసలు కన్నెత్తి చూడలేదని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయ్.

డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్న బైకర్

ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అభిలాష్ దర్శకత్వంలో వచ్చిన  శర్వానంద్ బైకర్ పై  భారీ ఆశలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయ్. యువీ క్రియేషన్స్ పై రావడం, సినిమామీద నమ్మకంతో శర్వా కూడా ఇన్వెస్ట్ చేశాడన్న టాక్ స్ప్రెడ్ అవడంతో ఎక్కువ రేట్లు పెట్టి కొన్న బయ్యర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని తెలుస్తుంది. సినిమాలో కావాల్సినంత సెంటిమెంట్ ఉంది కానీ, ఆడియన్స్ కోరుకునే మినిమం ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం ఈ సినిమా పాలిట శాపంగా మారిందని నెట్టింట్లో వినిపిస్తున్న కామెంట్స్. అయితే స్పోర్ట్స్ కి ముఖ్యంగా బైక్ రేస్ లని ఇష్టపడే వారికి తప్ప రెగ్యులర్ ఆడియన్స్ ఈ ‘సోలో ట్రావెల్’ బోరింగ్ డ్రామా ఎక్కలేదని,కేవలం ఎమోషన్ నమ్ముకుని రెండున్నర గంటల సినిమాను తీయడం పెద్ద మైనస్ అని వస్తున్న కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయ్ కూడా.అయితే అక్కడక్కడా  పాజిటివ్ రివ్యూలు వస్తున్నా అవి వసూళ్లుగా ఎందుకు మారడం మేకర్స్ ని వేదిస్తున్న ప్రశ్న.40 కోట్ల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా, ఇప్పటికీ 10 కోట్ల మార్కు వద్దే ఆగిపోవడం, ఇక  హైదరాబాద్‌లోని కొన్ని మల్టీప్లెక్స్‌లు మినహాయిస్తే, మిగిలిన చోట్ల ఈ సినిమాను చూసే వాళ్ళే లేకపోవడం, ఇదిలాగే కంటిన్యూ అయితే బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని  ట్రేడ్ వర్గాల  నుండి వినిపిస్తున్న మాట .

ఐపీఎల్ ఎఫెక్ట్ తో థియేటర్లకు ప్రేక్షకులు దూరం

సోషల్ మీడియాకే పరిమితమైన రాకాస

ఇక బైకర్ సంగతి ఇలా ఉంటే  సంగీత్ శోభన్ రాకాస సినిమా పరిస్థితి మరీ విచిత్రం. ఏదో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని, యూత్ కి కనెక్ట్ అవుతుందని హైప్ ఓ రేంజ్ లో  క్రియేట్ చేశారు కానీ, అది కేవలం సోషల్ మీడియాకే పరిమితమైందన్నది కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే బైకర్ సినిమా మరీ వీక్‌గా ఉండటంతో రాకాస కలెక్షన్లు కొంచెం బెటర్‌గా ఉండటమే. నిజానికి 20 కోట్ల బిజినెస్ అంటే అది చిన్న సినిమాకి చాలా పెద్ద మొత్తం. మరో వైపు నిర్మాత నీహారిక గట్టిగానే ప్రమోట్ చేస్తున్నా, కంటెంట్‌లో డెప్త్ లేకపోవడంతో  సినిమా విలవిలలాడుతోంది. ఇప్పటికే సగం వసూళ్లు వచ్చాయని నమ్మబలుకుతున్నా, అసలు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ నాలుగు రోజులు అద్భుతం జరగాలి. అది ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే అసాధ్యమే అని చెప్పాలి.

‘రాకాస’ సినిమా పరిస్థితి కూడా అంతేనా?

పాత సినిమా చూసుకోవడమే మేలు అంటున్న ఆడియన్స్

ఇక  వీటికి తోడు రిలీజైన లీడర్, కార్మేని సెల్వం లాంటి డబ్బింగ్ సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతా మంచిది.అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ దురంధర్ ది రివెంజ్ సినిమా మళ్ళీ చాలా సెంటర్లలో పుంజుకోవడం ఈ కొత్త సినిమాలకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. మొత్తానికి  పనికిరాని కొత్త సినిమాల కంటే పాత సినిమా చూసుకోవడమే మేలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారన్న మాట. చూడాలి వచ్చే వారం అయినా డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, పల్లి చట్టంబి వంటి సినిమాలు ఏమైనా కాసులు కురిపిస్తాయో !

మొత్తానికి ‘బైకర్’, ‘రాకాస’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడంతో, రాబోయే సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.