|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: కిడ్నాప్‌తో రేఖకు దిమ్మతిరిగే షాక్!

Published: 02-04-2026, 12:35 AM
బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్: కిడ్నాప్‌తో రేఖకు దిమ్మతిరిగే షాక్!
  • బ్రహ్మముడి సీరియల్: కృష్ణయ్యకు మొరపెట్టుకున్న ఇందు.. యుద్ధానికి సిద్ధం!
  • రేఖకు ఐశ్వర్య షాక్: రాజు ద్వారా ఇందు కిడ్నాప్‌కు ప్లాన్!
  • ఆస్తి కోసం రేఖ ప్లాన్: పుట్టినరోజున పేపర్లపై సంతకం చేయించే కుట్ర!
  • రూ.10 లక్షల కోసం రాజు: ఐశ్వర్య ఆఫర్‌తో కిడ్నాప్‌కు సిద్ధం!

బ్రహ్మముడి సీరియల్‌లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందు జీవితం ఊహించని మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే!

ఇందు యుద్ధం: ఒంటరి పోరాటం!

Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 2 ఎపిసోడ్ లో ఇందు యుద్దానికి సిద్ధమవుతున్నా ఒంటిరిని అయిపోయానని కృష్ణయ్యకు మొరపెట్టుకుంటుంది. అయితే ఆ సాయం పరోక్షంగా కిడ్నాప్ రూపంలో రాజు చేయబోతన్నాడని తేలిపోయింది.

Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఐశ్వర్య గట్టి షాకే ఇవ్వబోతున్నట్లు తేలింది. ఇందుని రాజు ద్వారా కిడ్నాప్ చేయించి తనకు కావాల్సిన డబ్బును సంపాదించాలని భావిస్తుంది. అటు రాజు, లక్కీ కూడా సాహు భయంతో దీనికి ఒప్పుకుంటారు.

సంతకం పెట్టొద్దని చెప్పిన అపర్ణ.. ధైర్యం చెప్పిన ఇందు

కిడ్నాప్ ప్లాన్: రేఖకు ఐశ్వర్య షాక్!

మరి సంతకం పెడతావా అని అపర్ణ అడుగుతుంది. మిమ్మల్ని కాపాడుకోవడమే తన లక్ష్యమని ఇందు చెబుతుంది. సంతకం పెట్టకుండా ఎలా కాపాడుకోవాలన్నదే ఆలోచిస్తున్నానని అంటుంది. ఎప్పుడో ప్రమాదంలో చనిపోవాల్సిన వాళ్లం.. ఇంకా బతికి ఉన్నామంటే ఏదో సాధించడానికే.. ఇంత వరకూ కోల్పోయిందే ఎక్కువ.. ఇక అంతా సాధించాల్సిందే అని స్పష్టం చేసి వెళ్లిపోతుంది. ఈ యుద్ధంలో ఇందు ఒంటరిగా మిగిలిపోయిందని సుభాష్, అపర్ణ బాధపడతారు.

దీంతో రేఖ అసలు ప్లాన్ చెబుతుంది. మరో రెండు రోజుల్లో దాని పుట్టిన రోజు రాబోతోంది.. ఆ రోజే ఆస్తి పేపర్లపై సంతకం పెట్టిస్తాను.. దీంతో ఆస్తి మొత్తం మనది అవుతుంది.. అందుకే దానితో అలా ప్రేమగా ఉన్నానని రేఖ చెప్పడంతో భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటుంది.

ఇందుకు ఫోన్ చేసి తిట్టిన రాజు

రాజు సాయం: కిడ్నాప్‌కు ఒప్పుకుంటాడా?

రేఖను డబ్బులు అడిగిన ఐశ్వర్య

కృష్ణయ్యకు మొరపెట్టుకున్న ఇందు

అటు డబ్బు కోసం సాహు.. రాజు తమ్ముడు వెంకీకి యాక్సిడెంట్ చేయిస్తాడు. తర్వాత రాజును బెదిరిస్తాడు. ఈసారి మీ అమ్మానాన్నలపైకి బుల్డోజర్ వస్తుందని అంటాడు. దీంతో ఆ రూ.10 లక్షల కోసం ఐశ్వర్య ఇచ్చిన ఆఫర్ ను రాజు తీసుకుంటాడు. ఎవరిని కిడ్నాప్ చేయాలని అడిగితే.. ఇందు ఫొటో చూపిస్తుంది ఐశ్వర్య. ఆస్తి పేపర్లపై సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్న ఇందుకు పరోక్షంగా ఐశ్వర్య, రాజు ఇలా సాయం చేయబోతున్నట్లుగా ఓ ట్విస్ట్ ఎదురైంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా ముగిసింది. రేఖ ప్లాన్ ఫలిస్తుందా? రాజు కిడ్నాప్‌కు సహకరిస్తాడా? మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.