
స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ జులై 31 ఎపిసోడ్‌లో అనేక ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. రాజ్ యామినికి షాకింగ్ వార్త చెప్పడంతో పాటు, స్వరాజ్ ప్రవర్తన రుద్రాణిలో అనుమానాలకు దారితీసింది. ఈ ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న ముఖ్య సంఘటనలు ఇక్కడ ఉన్నాయి.
Key Points
రాజ్ యామినికి షాకింగ్ వార్త చెప్పాడు.
రుద్రాణిలో స్వరాజ్ ప్రవర్తనపై అనుమానాలు మొదలయ్యాయి.
స్వరాజ్, అపర్ణ మరియు సుభాష్ మధ్య ఉద్రిక్తత పెరిగింది.
ఇందిరా దేవి, రాజ్ మరియు కావ్యల ప్రణాళికలో కీలక మలుపు.
యామినికి రాజ్ ఇచ్చిన షాకింగ్ వార్త
స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు అంటే జులై 31 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్ కూడా ట్విస్టులతో ఇంట్రెస్టింగా సాగింది. అటు యామినికి షాక్ ఇచ్చిన రాజ్.. ఇటు కావ్యకు ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
బ్రహ్మముడి సీరియల్ గురువారం (జులై 31) ఎపిసోడ్ కూడా స్వరాజ్ కు అపర్ణ , సుభాష్ లు తినిపించే సీన్ తో మొదలవుతుంది. తిన్న తర్వాత నీళ్లు తాగడానికి కూడా స్వరాజ్ మారాం చేస్తాడు. తనకూ కాళ్లు నొప్పిగా ఉన్నాయంటూ కూర్చొన్న చోటే అతనికి నీళ్లు తాగించి తాను యాక్టింగ్ చేసినట్లు అపర్ణ చెబుతుంది. ఆ తర్వాత తనను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాలనడంతో చేసేది లేక అపర్ణ వాడిని ఎత్తుకొని వెళ్తుంది.
అమ్మని రేవతి కొడుక్కి దగ్గర చేయడంలో తాను సక్సెస్ అయ్యాయని రాజ్ అనడంతో 50 శాతమే అయ్యారని కావ్య అంటుంది. మిగిలిన 50 శాతం కూడా అయితే అపర్ణ చేతుల్లో మీకు ఉంటుందంటూ సీన్లోకి ఇందిరా దేవి ఎంటరవుతుంది. తనకు చెప్పకుండా ఎందుకు రేవతి కొడుకుని తీసుకొచ్చారని నిలదీస్తుంది. ఈ విషయం తెలిస్తే ఎంత గొడవ అవుతుందో అని ఆందోళన చెందుతుంది.
అప్పుడు ఇందిరా దేవికి తన ప్లాన్ గురించి చెబుతాడు రాజ్. స్వరాజ్ ను ఇలాగే అమ్మకి దగ్గరగా చేసి వాడిపై ఉన్న ప్రేమను అతి ప్రేమగా మార్చేసి, వాడికి అడిక్ట్ అయిపోయేలా చేస్తామని అంటాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వాడిని దూరం చేస్తే అని చెప్పబోగా.. అలా చేస్తే రేవతిని అపర్ణ క్షమించేసి ఇంట్లోకి తీసుకొస్తుందా అని ఇందిరాదేవి ప్రశ్నిస్తుంది.
వాడు లేకుండా ఉండలేని పరిస్థితుల్లో కూతురి కోసం కాకపోయినా మనవడి కోసమైనా అలా చేస్తుందని రాజ్ అంటాడు. నీ ప్లాన్ వింటుంటే బాగానే ఉంది.. వాళ్లిద్దరూ కలిస్తే చూడాలని ఆశగా ఉందని, అదే జరగాలని కోరుకుంటున్నట్లు ఇందిరాదేవి చెబుతుంది.
రుద్రాణిలో పెరుగుతున్న అనుమానాలు
ఇంట్లోకి వెళ్లిన తర్వాత కూడా స్వరాజ్ అటూఇటూ పరుగెత్తుతుంటాడు. అతడు తనను ఎక్కడ చూసేస్తాడో అని ఇందిరాదేవి ముసుగేసుకొని ఇంట్లోకి వస్తుంది. ఇంతలో ఆ పిల్లాడు ఆమెను ఢీకొడతాడు. ఆ తర్వాత తాతమ్మ అని పిలుస్తాడు. అది విని ఇంట్లో వాళ్లంతా షాకవుతారు. రుద్రాణి వెంటనే లేచి వచ్చి ఆమెను తాతమ్మ అని ఎందుకు పిలిచావంటుంది. అటు సుభాష్ కూడా అదే అడుగుతాడు. అసలు విషయం ఎక్కడ చెప్పేస్తాడో అని ఇందిరాదేవితోపాటు రాజ్, కావ్య ఆందోళన చెందుతారు.
ఎందుకంటే అంటూ మా అమ్మ చెప్పిందని అనడంతో వాళ్లు మరింత కంగారు పడతారు. బోండాంలో కనిపించే ఇలాంటి ముసలమ్మలు కనిపిస్తే తాతమ్మ అని పిలవాలని చెప్పిందని, అంతేకాదు వాళ్లు రోడ్డుపై కనిపిస్తే సాయం కూడా చేయాలని చెప్పిందంటాడు. దీంతో వాళ్లు ఊపిరి పీల్చుకుంటారు. సరే పడుకుందువుగానీ రా అని అపర్ణ పిలిస్తే.. తాను ఈ అంకుల్ వాళ్లతో ఆడుకుంటానంటూ రాజ్, కావ్యలను బయటకు తీసుకెళ్తాడు.
తాను నిజం చెప్పేస్తానేమో అని భయపడ్డారా అని రాజ్, కావ్యలతో స్వరాజ్ అంటాడు. ఊరికే ఆటపట్టిద్దామని అలా చేశానంటాడు. దీంతో గుడి దగ్గర తనకు చాక్లెట్లు ఇచ్చి ఎవరు కనిపించినా గుర్తు పట్టనట్లుగా ఉండాలని చెప్పిన విషయాన్ని స్వరాజ్ గుర్తు చేసుకుంటాడు. వీడికి అన్నీ మీ పోలికలే వచ్చాయంటూ రాజ్ తో అంటుంది కావ్య.
నా పోలికలు రావడమేంటని అతడు అయోమయానికి గురవుతాడు. అటు వీళ్లను కిటికీలో నుంచి చూస్తున్న రుద్రాణికి మరింత అనుమానం కలుగుతుంది. ఆ పిల్లాడికి ఈ ఇంటితో ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందనిపిస్తోందని, అతడు ఎవరో కనిపెడతానని రాహుల్ తో అంటుంది. కానీ అతడు మాత్రం పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.
అటు యామిని ఇంట్లో డిన్నర్ చేయకుండా రాజ్ కోసం వేచి చూస్తూ ఉంటుంది. తిందారాం అని తల్లి, తండ్రి పిలిస్తే.. రాజ్ కోసం చూస్తున్నాను, ఎక్కడైనా భర్త తినకుండా భార్య తింటుందా అని ప్రశ్నిస్తుంది. దీంతో వాళ్లు షాకవుతారు. భౌతికంగా తమ పెళ్లి కాకపోయినా.. మనసులో తాను అతన్ని భర్తగానే భావిస్తున్నాని అంటుంది.
స్వరాజ్ చర్యల వల్ల పెరిగిన ఉద్రిక్తత
నిన్ను వద్దనుకొని పీటల మీద పెళ్లి ఆపిందే రాజ్ కదా.. అతడు మళ్లీ ఎలా వస్తాడనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తారు. మీరు చూస్తూ ఉండండి.. బావ మళ్లీ నా దగ్గరికే వస్తాడు.. తను ప్రాణంగా ప్రేమించే కావ్యను వదిలేసి వస్తాడని కాన్ఫిడెంట్ గా చెబుతుంది.
అప్పుడే యామినికి రాజ్ ఫోన్ చేస్తాడు. తను ఇంకా ఆలస్యమవుతుందని అంటాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే.. ఇవాళ కావ్యకు ప్రపోజ్ చేద్దామనుకుంటున్నట్లు చెబుతాడు. దీంతో యామినికి మండిపోతుంది. అదే విషయం తల్లిదండ్రులతో చెబుతుంది.
దీంతో తండ్రి రఘునందన్ ఆమెకు క్లాస్ పీకుతాడు. వాళ్ల మధ్య తాళి బంధమే వాళ్లను ఒక్కటిగా ఉంచుతోందని, ఇక నుంచి ఎలా ప్లాన్స్ చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. అయినా యామిని మాత్రం వినదు. తాను రాజ్ ను దక్కించుకుని తీరతానని అంటుంది.
అటు కావ్యకు రాజ్ ప్రపోజ్ చేయడానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో తన దగ్గర ఉన్న స్వరాజ్ ను అపర్ణ దగ్గరే పడుకోవాలని కావ్య చెబుతుంది. అలా చేస్తే ఐస్ క్రీమ్ కొనిస్తానని అంటుంది. తన దగ్గరికి వచ్చిన రాజ్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఆశగా ఎదురు చూస్తుంది.
అతడు మాత్రం తాను ఏం చెప్పాలనుకుంటున్నానో తెలిసి కూడా తెలియనట్లుగా ఉంటారని కావ్యతో అంటాడు. నేను మిమ్మల్ని అని ఏదో చెప్పబోతాడు. అప్పుడే ప్రకాశ్ రావడంతో రేపు చెబుతానని వెళ్లిపోతాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి జులై 31 ఎపిసోడ్ ట్విస్టులతో ఉత్కంఠభరితంగా ముగిసింది. రాజ్, ఇందిరా దేవి, కావ్యల ప్రణాళిక ఫలించేనా? స్వరాజ్, అపర్ణల మధ్య సంబంధం ఏమవుతుంది? వచ్చే ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూద్దాం.


