|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సెప్టెంబర్ 29 ఎపిసోడ్: రాజ్ బెండు తీసిన కావ్య- శత్రువుల కళ్యాణ్- అన్నదమ్ముల మెడికల్ నేరం

Published: 29-09-2025, 9:46 AM
బ్రహ్మముడి సెప్టెంబర్ 29 ఎపిసోడ్: రాజ్ బెండు తీసిన కావ్య- శత్రువుల కళ్యాణ్- అన్నదమ్ముల మెడికల్ నేరం

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 29 ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠతో సాగింది. బిడ్డ కోసమే పోరాడుతానని కావ్య రాజ్‌ను ధైర్యంగా ఎదురించింది. అయితే, రాజ్ మాత్రం బిడ్డను అబార్షన్ చేయించాలని రహస్యంగా ప్లాన్ చేశాడు. ఈ మెడికల్ నేరం కళ్యాణ్‌కు తీవ్ర ఆందోళన కలిగించింది. మరి రాజ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? కావ్య నిజం తెలుసుకుంటుందా?

Key Points

1

బిడ్డ కోసం రాజ్ నిర్ణయాన్ని ఎదురించిన కావ్య, నాకు బిడ్డే కావాలని స్పష్టం చేసింది.

2

రాజ్ తన ఫ్రెండ్ డాక్టర్ సుధాకర్ పేరు చెప్పి అబార్షన్ ట్యాబ్లెట్స్ తెప్పించే ప్రయత్నం.

4

రాజ్ ప్రవర్తన వెనుక ఉన్న పెద్ద కారణాన్ని తెలుసుకోవాలని కావ్య నిర్ణయం.

బిడ్డ కోసం కావ్య కఠిన నిర్ణయం!

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నేను కావాలా, ఆ బిడ్డ కావాల తేల్చుకో అని రాజ్ అంటే.. నాకు బిడ్డే కావాలి. మీకన్న నా బిడ్డే ముఖ్యం. నా బిడ్డ కోసం ఆ దేవుడిని కూడా ఎదురించడానికి సిద్ధంగా ఉన్నానని కావ్య వెళ్లిపోతుంది. రాజ్ కూడా వెళ్లిపోతాడు. వీడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇంకా ఏదో కారణం ఉందని అపర్ణ అంటుంది.

మరోవైపు రాజ్‌తో నిజం చెప్పమని, కనీసం ఇంట్లోవాళ్లు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారని కల్యాణ్ అంటాడు. ప్రాణం పోయిన పర్లేదు. బిడ్డకు ప్రాణం పోసే తీరుతానని కళావతి అంటుంది అని రాజ్ అంటాడు. కానీ, డాక్టర్ తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేయకూడదన చెప్పారుగా. చెప్పకుండా ఎలా చేస్తావ్ అని కల్యాణ్ అంటే.. దానికి నేను ఓ ప్లాన్ చేశాను అని బయటకు వెళ్తాడు రాజ్.

ఓ మెడికల్ షాప్‌కు వెళ్లి తన ఫ్రెండ్ డాక్టర్ సుధాకర్ రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకొచ్చే షాప్. నువ్వేళ్లి డాక్టర్ పంపినట్లుగా అబార్షన్ ట్యాబ్లెట్స్ తీసుకురా అని రాజ్ అంటాడు. నాకు భయంగా ఉంది. పోలీసులకు తెలిస్తే తీసుకెళ్లి జైలులో వేస్తారు. చట్టరీత్యా నేరం అవుతుంది. వదినను మోసం చేసినట్లు అవుతుంది. ఇలాంటిది చేశామని తెలిస్తే వదిన జీవితంలో క్షమించదు అని కల్యాణ్ అంటాడు.

అబార్షన్ ప్లాన్: రాజ్ మెడికల్ నేరం?

తను ఇప్పుడు ప్రాణాలతో ఉండటం ఇంపార్టెంట్ అని రాజ్ అంటాడు. ఇప్పుడు వెళ్లి వాన్ని ట్యాబ్లెట్స్ అడిగితే ఏమవుతుందో ఏమో అని భయంగానే వెళ్తాడు కల్యాణ్. మరోవైపు వాడు చెప్పినదానికి భార్యగా ఎక్కడ బెండ్ అవుతావో అనుకున్నా.. కానీ వాడి బెండ్ తీసేలా మాట్లాడావ్. అత్తగా నీకు ఫుల్ సపోర్ట్ నాదే. నువ్వు ఎక్కడ తగ్గకు అని కావ్యను మెచ్చుకుంటుంది అపర్ణ.

సర్దిచెప్పాల్సిపోయింది ఇలా అంటావేంటీ అని ఇందిరాదేవి అంటుంది. వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూశారా. అంతా వాడి ఇష్టమేనా. మొన్నటిదాకా సంబరపడి ఇప్పుడు మూర్ఖుడిలా బిహేవ్ చేస్తున్నాడు అని రాజ్‌ను తిడుతుంది అపర్ణ . ఈ విషయంలో ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఆలోచించాలి. ఇలా చేస్తున్నారంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అని ఇందిరాదేవితో కావ్య అంటుంది.

కానీ, అది ఎలా తెలుసుకుంటావ్ అని ఇందిరాదేవి అంటుంది. ఎలాగోలా తెలుసుకోవాలి. ఇవాళ్టీ నుంచి అదే పనిలో ఉంటాను అని కావ్య అంటుంది. మెడికల్ షాప్‌కు వెళ్లి సుధాకర్ పంపించారని, ట్యాబ్లెట్స్ అడుగుతాడు కళ్యాణ్. ఇవి అబార్షన్ ట్యాబ్లెట్స్. మీతో పాటు డాక్టర్ కానీ, నర్స్ గానీ ఉండాలి. ఈ మధ్య ఇలాంటివి ఫ్రాడ్ చేస్తున్నారు. తర్వాత కోర్ట్ చుట్టూ మేము తిరగాలి. ఉండండి సుధాకర్ గారికి కాల్ చేస్తాను అని మెడికల్ షాప్ అతను అంటాడు.

నిజం తెలుసుకోవడానికి కావ్య ప్రయాణం

దాంతో మీ ఫోన్ నుంచి చేయకండి. అవసరం నాది కదా. నా ఫోన్ నుంచి చేస్తాను అని రాజ్‌కు కాల్ చేస్తాడు కల్యాణ్. మీరు చెప్పారని ఇక్కడికి వస్తే మీరు లేకుంటే ట్యాబ్లెట్స్ ఇవ్వనంటున్నారు. మీరు ఓసారి సుధాకర్‌లా మాట్లాడండి అని కల్యాణ్ అంటాడు. మాట్లాడటం ఏంటీ ఆయన సుధాకర్ కాదా అని షాప్ అతను అంటాడు. ఆయనే అని ఫోన్ షాప్ అతనికి కల్యాణ్ ఫోన్ ఇస్తాడు.

ఏంటీ లక్షణ్ నేను చెప్పిన కూడా ఇవ్వట్లేదా. తను మనోడే. నేనే పంపించాను ఇవ్వు అని డాక్టర్ సుధాకర్‌లా మాట్లాడుతాడు రాజ్. దాంతో ట్యాబ్లెట్స్ ఇచ్చిన మెడికల్ షాప్ అతను గొంతు మారిపోయిందేంటీ అని డౌట్ పడతాడు. జలుబు వచ్చింది. విసిగించకుండా ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపమని డాక్టర్‌లా రాజ్ కోప్పడతాడు. రాజ్‌కు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చిన కళ్యాణ్ వదినకు తెలియకుండా చూసుకో. శత్రువుల్లా మిగిలిపోతాం. మంచి చేసి శత్రువులైతే బాధపడాల్సి వస్తుందని అంటాడు.

మరోవైపు రాజ్ తీసుకొచ్చిన బేబీల ఫొటోలను కావ్య గుర్తుకు తెచ్చుకుంటుంది. నాకు నలుగురు పిల్లలు కావాలని రాజ్ అన్నది గుర్తు చేసుకుంటుంది. ఎందుకు క్రికెట్ టీమ్ రెడీ చేద్దాం అని కావ్య అంటే రాజ్ ఎత్తుకుని తిప్పుతాడు. బేబీల ఫొటోలను గోడపై అంటిస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కావ్య బిడ్డ విషయంలో రాజ్‌ను ధైర్యంగా ఎదురించడం, రాజ్ మెడికల్ నేరం ప్లాన్ చేయడం, కళ్యాణ్ భయం వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్‌ను ఉత్కంఠగా మార్చాయి. రాజ్ ప్లాన్ ఏమవుతుంది, కావ్య నిజం ఎలా తెలుసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.