|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ అవార్డు గ్రహీతలకు మెగాస్టార్ చిరంజీవి విషెస్

Published: 29-05-2025, 10:15 AM
గద్దర్ అవార్డు గ్రహీతలకు మెగాస్టార్ చిరంజీవి విషెస్

ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డుల గురించి మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి గద్దర్ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

2

అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

4

14 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవార్డులను ప్రకటించింది.

చిరంజీవి శుభాకాంక్షలు

ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను(Gaddar Awards) తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. FDC చైర్మన్ దిల్‌రాజుతో కలిసి జ్యూరీ చైర్‌పర్సన్‌ జయసుధ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా ప్రభాస్ కల్కీతో పాటు మరో రెండు సినిమాలకు అవార్డులు లభించాయి. తాజాగా అవార్డు గ్రహీతలకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘అవార్డులు అందుకోబోతున్న విజేతలు అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి అవార్డులు నటుడికి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం చాలా సంతోషం. ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మంత్రివర్గానికి, అధికారులకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు. కాగా, ఈ అవార్డుల్లో మెగా డాటర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు రెండు పురస్కారాలు దక్కాయి. దాదాపు 14 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం ఇలా రాష్ట్ర అవార్డుల్ని ప్రకటించింది.

Hearty Congratulations to each and every winner of the First #GaddarTelanganaFilmAwards for the year 2024. 👏👏 State recognition is extremely precious and motivating for any Artiste and Technician in the Creative fraternity. It’s greatly encouraging to see the Government of…

గద్దర్ అవార్డు విజేతలు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

చిరంజీవి అందించిన శుభాకాంక్షలు తెలుగు సినిమా రంగానికి ఉత్సాహాన్నిచ్చాయి. ఈ అవార్డులు తెలుగు సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.