|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RRR రికార్డును చిత్తు చేసిన చిరంజీవి సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం!

Published: 17-01-2026, 5:30 AM
RRR రికార్డును చిత్తు చేసిన చిరంజీవి సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం!
  • చిరంజీవి సినిమా ఐదో రోజు కలెక్షన్లలో RRR రికార్డును బద్దలు కొట్టింది.
  • MSG చిత్రం ఐదో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.14.70 కోట్ల షేర్ వసూలు చేసింది.
  • ఈ సినిమా బుక్‌మైషోలో 2.5 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.200 కోట్ల మార్కును దాటిన MSG.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన ఐదవ రోజునే RRR సినిమా రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

MSG కలెక్షన్ల సునామీ

MSVPG Collections: మెగాస్టార్ చిరంజీవి.. నటించిన సంక్రాంతి ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు (MSG) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన రోజునుంచి మంచి టాక్‌తో పాటు భారీ వసూళ్లు సాధిస్తూ, ప్రతిరోజూ ఏదో ఒక రికార్డ్‌ను బద్దలుకొడుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు కలెక్షన్లలో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్‌ను నమోదు చేసింది.

దర్శకుడు అనిల్ రావిపూడి.. తెరకెక్కించిన ఈ చిత్రం, ఐదో రోజు ఏపీ..తెలంగాణ కలిపి రూ.14.70 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఇది ఇంతకు ముందు ఉన్న రికార్డ్‌ను మించి పోయింది. ఆ రికార్డ్‌ను RRR సినిమా నెలకొల్పింది. ఆ చిత్రం ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.13 కోట్ల షేర్‌ను సాధించింది. ఇప్పుడు MSG ఆ రికార్డ్‌ను అధిగమించి..ఐదో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

RRR రికార్డు బ్రేక్

టికెట్ అమ్మకాల పరంగా కూడా ఈ సినిమా అదరగొడుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే BookMyShowలో 2.5 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఈ సినిమా క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటింది. మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.226 కోట్లకు పైగా నమోదయ్యాయి.

సినిమాకు ఇంకా వేగం తగ్గేలా కనిపించడం లేదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు మంచి ఫుట్‌ఫాల్స్ కనిపిస్తున్నాయి. వీకెండ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఈ రోజు మరియు రేపు మరింత భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వస్తుండటంతో, సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా రన్ ఇంకా బలంగా కొనసాగనుంది.

ఓవర్సీస్‌లోను భారీ వసూళ్లు

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా వీకెండ్ అడ్వాంటేజ్‌తో MSG మరింత పికప్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, మెగాస్టార్ చరిష్మా, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఆపలేని విజయంగా మార్చాయి.

మొత్తానికి చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.