|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూసీ తీరాన ఓంకారేశ్వరుడి కొలువు! రేవంత్ రెడ్డి సంకల్పం.. నల్గొండకు విముక్తి!

Published: 28-03-2026, 3:05 AM
మూసీ తీరాన ఓంకారేశ్వరుడి కొలువు! రేవంత్ రెడ్డి సంకల్పం.. నల్గొండకు విముక్తి!
  • మూసీ నది ఒడ్డున రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం
  • ఆలయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • మూసీ ప్రక్షాళనతో నల్గొండ ప్రజల కష్టాలు తీరుతాయని సీఎం వ్యాఖ్య
  • గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తున్నట్లు వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.

మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆలయ నిర్మాణానికి డిజైన్‌ను మూసీ రివర్‌ఫ్రంట్‌ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు ఆలయంలో వంద అడుగుల గాలిగోపురాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన 3D నమూనా కూడా విడుదలైంది.

మూసీ ప్రక్షాళనతో నల్గొండకు విముక్తి: సీఎం రేవంత్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ ప్రక్షాళన అత్యవసరమన్నారు. హైదరాబాద్‌ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తోందని.. నల్గొండ వరకూ వెళ్తోందని చెప్పారు. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు చాలా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి ఈ ప్రాంతంలో ఉందన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలిస్తున్నామని…. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదమని వ్యాఖ్యానించారు.

రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మూసీ నది ప్రక్షాళనతో నల్గొండ ప్రజల కష్టాలు తీరుతాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశిస్తోంది. ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం ఒక శుభసూచకంగా ప్రజలు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.