
బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్ రాజకీయ నాయకుడు ఆదిత్య ఠాక్రేతో హోటల్‌లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో వారిద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందనే పుకార్లు జోరందుకున్నాయి. అయితే, దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
Key Points
బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్ డేటింగ్ వార్తల్లో నిలిచింది.
ముంబై హోటల్‌లో రాజకీయ నాయకుడు ఆదిత్య ఠాక్రేతో కనిపించింది.
వీరి వీడియో వైరల్ కావడంతో డేటింగ్ పుకార్లు వెల్లువెత్తాయి.
యంగ్ గ్లోబల్ లీడర్స్ విందులో కలిశారని, సంబంధం లేదని స్పష్టం.
బాలీవుడ్ నటి డేటింగ్ పుకార్లు
ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు తమ సహ నటులతో డేటింగ్ చేయడం కామన్ అయిపోయింది. కొద్ది కాలం పాటు ఎంజాయ్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఒకేచోట కనిపించినా.. డేటింగ్ పుకార్లు ఎక్కువైపోతున్నాయి. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా ఓ రాజకీయ నాయకుడితో హోటల్‌లో అడ్డంగా దొరికిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్. పలు చిత్రాల్లో నటించడంతో పాటు వాతావరణ పరిరక్షణకు తన వంతు పాటుపడుతూ యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో సభ్యురాలిగా కూడా చేరింది.
అన్ని రంగాల్లో ఉన్న భూమి ముంబైలోని బాంద్రా ఉన్న ఓ హోటల్‌లో రాజకీయ నాయకుడు ఆదిత్య ఠాక్రేతో కనిపించింది. వీరితో పాటు మరికొందరు సన్నిహితులు కూడా ఉన్నారట. యంగ్ గ్లోబల్ లీడర్స్ సభ్యుల కోసం విందు ఏర్పాటు చేయగా.. అందులో వీరిద్దరికి సంబంధించిన వీడియో మాత్రమే వైరల్ అవుతుండటంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వారు ఆ పార్టీలో మాత్రమే హాజరయ్యారు. అంతే తప్ప వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందనేది తెలియనప్పటికీ డేటింగ్ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
హోటల్‌లో భూమి, ఆదిత్య కలిసి..
నిజం లేదంటున్న సన్నిహితులు
భూమి ఫెడ్నేకర్, ఆదిత్య ఠాక్రేల మధ్య ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఒక విందులో మాత్రమే కలిశారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ, వారి డేటింగ్ పుకార్లు మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.


