
📌 Key Points
- దేవర 2 రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది.
- ఈ సినిమా 2027 చివరిలో విడుదల కానుంది అని నిర్మాత మిక్కిలినేని సుధాకర్ వెల్లడించారు.
- దేవర సినిమాకు సీక్వెల్ ఉంటుందని కొరటాల శివ ఇదివరకే స్పష్టం చేశారు.
- ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా లేదా అని అందరూ ఎదురు చూస్తుండగా, నిర్మాత మిక్కిలినేని సుధాకర్ దేవర 2 గురించి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
దేవర 2 షూటింగ్ ఎప్పుడు?
Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) , రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన నుంచి వచ్చిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన అందుకుని.. కాలక్రమేనా 500 కోట్ల క్లబ్లో చేరి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. అయితే ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అని కొంతమంది అభిమానులు ఆలోచిస్తుంటే? మరికొంతమంది అసలు సీక్వెల్ వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన కొరటాల శివ సీక్వెల్ ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
అయితే ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు? ఎప్పుడు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది? అనే విషయాలపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఎట్టకేలకు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన మిక్కిలినేని సుధాకర్ (Mikkilineni sudhakar)సాలిడ్ అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషీ పరిచారు. తాజాగా నందిగామలో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిక్కిలినేని సుధాకర్ దేవర 2 గురించి ప్రశ్న ఎదురవగా.. ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
నిర్మాత ప్రకటనతో అభిమానుల్లో ఆనందం
మిక్కిలినేని సుధాకర్ మాట్లాడుతూ.. “దేవర 2 తప్పకుండా ఉంటుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్ సందర్భంగా మే నుంచి మొదలు పెడతాము. 2027 ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉంటుందా? లేదా? అనుకున్న సినిమా నుంచి ఇప్పుడు ఇంత పెద్ద అప్డేట్ రావడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ గతంలో కేజిఎఫ్ 1,2 చిత్రాలతో సంచలనం సృష్టించి పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకి త్వరలోనే రిలీజ్ డేట్ తో పాటు సినిమా టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ , కొసరాజు హరికృష్ణ , నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీ ఖాన్ , షైన్ టామ్ చాకో, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా.. వారం రోజుల్లోనే 405 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది ఇక 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వసూలు దాటి మంచి విజయం అందుకుంది.
దేవర 2 గురించి వస్తున్న ఈ వార్తలతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎదురుచూస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఉన్నారు.


