|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ! వేణు ‘ఎల్లమ్మ’తో సంచలనం సృష్టిస్తారా?

Published: 06-02-2026, 3:35 AM
దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ! వేణు 'ఎల్లమ్మ'తో సంచలనం సృష్టిస్తారా?
  • జబర్దస్త్ వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ సినిమాతో దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు.
  • తెలంగాణ సంస్కృతిలో ఎల్లమ్మ తల్లి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
  • దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాలో పార్శీ అనే పాత్రలో నటిస్తున్నారు.
  • హీరో పాత్రకు ధీటుగా విలన్ పాత్రను తీర్చిదిద్దేందుకు వేణు ప్రయత్నిస్తున్నారు.

జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’

Yellamma:జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి (Venu yeldandi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైన సమయంలో కమెడియన్ గా తన సత్తా చాటిన ఈయన.. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. కాలక్రమేనా సినిమాలలో అవకాశాలు లభించడంతో జబర్దస్త్ కి దూరమయ్యారు. అక్కడే సినిమాలలో కమెడియన్ గా, నటుడిగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన వేణు తొలిసారి ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారి సంచలనం సృష్టించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అలా చిన్న తారాగణంతో తెలంగాణలోని గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు పలు విభాగాలలో అవార్డులు కూడా లభించాయి.

అలా ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన వేణు.. ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఎల్లమ్మ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి కారణం సరైన హీరో దొరకకపోవడమే. ముందుగా ఈ సినిమా కోసం చాలామంది హీరోలను వేణు అనుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఫైనల్ కాలేకపోయారు. ఇక చివరికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్గా సంచలనం సృష్టించి స్టార్ హోదాను దక్కించుకున్న దేవిశ్రీప్రసాద్, నటుడిగా తన ముఖానికి రంగు పులుముకోబోతున్నాడు అని తెలిసి అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

హీరోగా మారిన దేవిశ్రీప్రసాద్

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.పైగా సినిమా టైటిల్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది కూడా.. పైగా హీరో ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలంగాణ కల్చర్ లో భాగమైన ఎల్లమ్మ తల్లి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ పార్శీ అనే పాత్రలో కనిపిస్తాడని ముందే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో కీలక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక హీరోని తెరపై చూపించడానికి అటు విలన్ రోల్ కూడా అంతే ఈక్వల్ గా ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే హీరోకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో విలన్ పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వనున్నారట వేణు. అందుకుగాను ఒక సీనియర్ స్టార్ హీరోని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు వడ్డే నవీన్.

‘ఎల్లమ్మ’లో విలన్ పాత్ర కీలకం

ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వడ్డే నవీన్.. ఇప్పుడు రీ ఎంట్రీలో భాగంగా ఒక బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించారట. అందుకు తగ్గట్టుగానే వేణు కూడా ఈ కథ గురించి చెప్పడంతో చాలా ఎక్సైట్ అయిన వడ్డే నవీన్ కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.

మొత్తానికి దేవిశ్రీప్రసాద్ హీరోగా నటించనున్న ‘ఎల్లమ్మ’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వేణు దర్శకత్వం, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.