|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ టర్న్: నిర్మాతను ముంచిన స్టార్ డైరెక్టర్.. కోర్టు తీర్పుతో బండారం బట్టబయలు!

Published: 24-03-2026, 2:05 AM
షాకింగ్ టర్న్: నిర్మాతను ముంచిన స్టార్ డైరెక్టర్.. కోర్టు తీర్పుతో బండారం బట్టబయలు!
  • దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతను మోసం చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు.
  • ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థకు రూ.4.25 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం.
  • 2013లో నిర్మాత ఎల్రెడ్ కుమార్ సివిల్ సూట్ వేశారు.
  • సినిమా నిధులు మళ్లించాడని గౌతమ్ మీనన్‌కు కోర్టు చీవాట్లు.

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతను మోసం చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిర్మాతకు రూ.4.25 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

నిర్మాతను మోసం చేసిన గౌతమ్ మీనన్

Star Director : డైరెక్టర్ నిర్మాత మధ్య గొడవలు రావడం కామన్.. అదే కొన్నిసార్లు ఆ గొడవలు తారస్థాయికి చేరడంతో వాళ్లతో చేయాలనుకున్న సినిమాని కూడా నిర్మాతలు ఆపేస్తూ ఉంటారు.. మరి కొన్నిసార్లు ఆ గొడవలు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటాయి. ఈమధ్య ఇలాంటి వివాదాలు తరచూ మనం వినపడుతున్నాయి.. ఈమధ్య తెలుగులో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి వివాదాలు వినపడుతూనే ఉన్నాయి. ఎవరు ఎంతగా అనుకున్న సరే అవి మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ఓ నిర్మాత డైరెక్టర్ మీద కంప్లైంట్ ఇస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు గురించి రోజుకో వార్త బయటకొస్తూనే ఉంది. ప్రస్తుతం ఇది మరోసారి వార్తలో నిలిచింది.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ? అసలు సమస్య ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లలో గౌతమ్ మీనన్ ఒకరు.. గతంలో ఓ నిర్మాతని మోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ చిత్ర నిర్మాత కోర్టుని ఆశ్రయించగా ఆ కేసు ఇప్పటివరకు నడుస్తూనే ఉంది.. తాజాగా ఆ పాత కేసులో ఆయన ఓడిపోయారు. సినిమా కోసం ఖర్చు చేయాల్సిన నిధులను మళ్లించాడని కోర్టు అతడికి చీవాట్లు పెట్టింది.. అంతేకాదు ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థకు ఆయన భారీ జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారి చేసింది. దాదాపు రూ.4.25 కోట్లను 12 శాతం వడ్డీతో నిర్మాతకు చెల్లించాలి అని కోర్టు తీర్పు చెప్పింది. అది డైరెక్టర్కు పెద్ద షాక్ అనే చెప్పాలి.. ప్రస్తుత నీది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..

కోర్టు తీర్పులో సంచలన విషయాలు

సినిమా నిధుల మళ్లింపుపై కోర్టు ఆగ్రహం

వివరాల్లోకి వెళితే.. ప్రొడక్షన్ నెం. 6 సినిమా కోసం గౌతమ్ మీనన్ సంస్థ ఫోటాన్ ఫ్యాక్టరీతో నిర్మాత ఎల్రెడ్ కుమార్ తో ఒక డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఆయనకు పలు విధాలుగా నాలుగున్నర కోటి వరకు డబ్బులను నిర్మాతలు చెల్లించారు. కానీ అనుకున్న ఒప్పందం ప్రకారం ఆ సినిమాని డైరెక్టర్ ప్రారంభించలేకపోయాడు.. నిర్మాత 2013లో సివిల్ సూట్ వేశారు.. నిజానికి డైరెక్టర్ అనుకున్న సినిమాకి ఆ నిధులను వాడలేదని కోర్టు తేల్చేసింది. 2010 మే నెల నుండి ఇప్పటివరకు 12 శాతం వడ్డీతో కలిపి 4.25 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.. అంతే కాదు లాయర్ ఫీజు కింద దాదాపు 12 లక్షలు డైరెక్టర్ ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంత పెద్ద అమౌంట్ ని డైరెక్టర్ వెనక్కి తిరిగి ఇయ్యాలి అంటే ఇప్పుడు పరిస్థితులలో కష్టతరం అని చెప్పాలి.. మరి నిర్మాతలతో ఏదైనా మంతనాలు జరిపి ఆయన ఈ సమస్య నుంచి బయటపడతాడేమో చూడాలి. ఏది ఏమైనా కూడా డైరెక్టర్ వివాదం ఇండస్ట్రీలో పలు చర్చలకు దారితీసింది.. ఇక మీదట ఈ డైరెక్టర్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

గౌతమ్ మీనన్ నిర్మాతకు భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి రావడంతో ఈ వివాదం ముగిసింది. ఈ సంఘటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.