
📌 Key Points
- శ్రీదేవి మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
- చివరి చిత్రం మామ్ ఆడియో వేడుకలో శ్రీదేవి రాఘవేంద్రరావుతో సినిమా చేయాలనే కోరికను వెలిబుచ్చింది.
- శ్రీదేవి మరణం తనను మానసికంగా వేదనకు గురిచేసిందని రాఘవేంద్రరావు అన్నారు.
- శ్రీదేవి లాంటి చావు ఎవరికీ రాకూడదని రాఘవేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
దివంగత నటి శ్రీదేవి చివరి కోరికను నెరవేర్చలేకపోయానంటూ దర్శకుడు రాఘవేంద్రరావు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీదేవి చివరి కోరిక ఏమిటి?
Director: నార్త్ టు సౌత్ అని తేడా లేకుండా.. వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది దివంగత నటీమణి శ్రీదేవి. అతి తక్కువ సమయంలోనే అతిలోకసుందరిగా పేరు దక్కించుకున్న ఈమె ఎన్టీఆర్ ను మొదలుకొని చిరంజీవి వరకు అటు బాలీవుడ్ లో కూడా చాలామంది స్టార్ హీరోలతో కలిసి సందడి చేసింది. అందం , అభినయంతో , నటనతో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీదేవి (Sridevi) అనూహ్యంగా దుబాయ్ లో బాత్ టబ్ లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇకపోతే ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీ అనే చెప్పాలి. ఇకపోతే శ్రీదేవితో తమకున్న అనుబంధం గురించి ఎప్పటికప్పుడు అభిమానులు నటీనటులు ఆఖరికి దర్శకులు కూడా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్లు చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే “శ్రీదేవి చివరి కోరిక తీర్చలేకపోయాను” అంటూ ఒక స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మరి ఆయన ఎవరు? శ్రీదేవి కోరిన ఆ చివరి కోరిక ఏమిటి ? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఆయన ఎవరో కాదు కే రాఘవేందర్రావు. ముఖ్యంగా తన దర్శకత్వంలో ఏకంగా 24 చిత్రాలలో ఆమెను హీరోయిన్గా చూపించిన రాఘవేంద్రరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్లు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. శ్రీదేవి మరణం గురించి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..” శ్రీదేవి మరణం నన్ను మాత్రమే కాదు యావత్ సినీ లోకాన్ని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆమె చివరి చిత్రం మామ్ ఆడియో వేడుకలో నా కాళ్ళకు నమస్కరించి మళ్లీ మనం కలిసి ఒక సినిమా చేద్దాం సార్ అని ఆమె కోరింది. కానీ ఆ కోరిక తీరకముందే ఆమె దుబాయ్ లోనే ఒక హోటల్లో బాతు టబ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించడం నన్ను మానసికంగా వేదనకు గురిచేసింది. అంతటి గొప్ప నటి ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన అతిలోకసుందరి అలా స్వర్గస్తులవ్వడం బాధాకరం. ముఖ్యంగా ఆమె లాంటి చావు ఇంకొకరికి రాకూడదు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు రాఘవేంద్రరావు. ఇక ప్రస్తుతం శ్రీదేవి చివరి కోరిక గురించి బయటపెట్టి ఆయన ఎమోషనల్ అయ్యారు.
రాఘవేంద్రరావు ఎమోషనల్ కామెంట్స్
శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు స్పందన
శతాధిక దర్శకుడిగా పేరు దక్కించుకున్న కే రాఘవేంద్రరావు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారీ సెట్టింగ్లు, పండ్లతో పాటల చిత్రీకరణ, హీరోయిన్స్ ను పండ్లతో పోల్చడం, అద్భుతమైన విజువల్స్ ఆయన సినిమాల ప్రత్యేకత. ఇకపోతే చిరంజీవితో తీసిన ఘరానా మొగుడు సినిమా తెలుగులో అప్పట్లోనే 10 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఇటు తెలుగులోనే కాదు హిందీలో కూడా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న రాఘవేందర్రావు.. ఇప్పుడు ఇలా శ్రీదేవి గురించి చేసిన కామెంట్లు అభిమానులను కన్నీటి పర్యంతానికి గురిచేస్తున్నాయి.
శ్రీదేవి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆమె చివరి కోరిక తీర్చలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుందని రాఘవేంద్రరావు అన్నారు. వారి అనుబంధం గురించి ఆయన మాటలు అందరినీ కదిలించాయి.


