
📌 Key Points
- దర్శకుడు సింగీతం శ్రీనివాస్ 90 ఏళ్ల వయసులో మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నారు.
- వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
- సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సాంఘిక, జానపద పౌరాణిక నేపథ్యం కలిగి ఉన్నాయి.
- దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
తెలుగు సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు 90 ఏళ్ల వయసులో మళ్ళీ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
90 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాస్ రీఎంట్రీ
SSR 61: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆదిత్య 369, భైరవద్వీపం, పుష్పక విమానం వంటి సినిమాలతో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ (Singeetam Srinivasa Rao)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడుగా తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను పరిచయం చేసిన ఈయన కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే ప్రస్తుతం 9 పదుల వయసులో సింగీతం శ్రీనివాస్ తిరిగి మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ విషయాన్ని తాజాగా SSR 61 పేరుతో అధికారికంగా విడుదల చేశారు. సింగీతం శ్రీనివాస్ ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్(Nag Aswin) డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు అయితే ఇప్పుడు స్వయంగా ఈయన మెగా ఫోన్ పడుతూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమాని నేడు ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక అనౌన్స్మెంట్ వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో సింగీతం శ్రీనివాస్ క్రియేటివిటీ ఆయనకు సినిమాల పట్ల ఉన్న ప్రేమ, తరతరాల దర్శకులపై ఆయన చూపిన ప్రభావాన్ని గుర్తుచేసే క్లిప్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వీడియో ద్వారా ఈయన డైరెక్షన్లో వచ్చిన పుష్పక విమానం, ఆదిత్య 369 లాంటి క్లాసికల్ సినిమాలను మరోసారి గుర్తు చేశారు. ఇలా సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై సినిమా నిర్మాణం
ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)సంగీతం అందించబోతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన వైజయంతి మూవీస్ బ్యానర్ కు సింగీతం గారి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు సినిమా విశేషాలను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ఎంతో కీలకంగా మారబోతుందని చెప్పాలి.
ఇదివరకు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఎక్కువగా సాంఘిక, జానపద పౌరాణిక సినిమాల నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈయన చివరిగా 2013 వ సంవత్సరంలో వెల్కమ్ ఒబామా అనే సినిమాకు దర్శకత్వం వహించారు .ఈ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకున్న 94వ సంవత్సరంలో దర్శకుడిగా 61వ సినిమాని ప్రకటించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈయన దర్శకుడిగా హాలీవుడ్ తరహా ప్రయోగాలను కూడా తెలుగు సినిమాలపై చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ కు మరింత ప్రతిష్టను తెస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని ఆశిద్దాం.


