|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పంజాబీ సింగర్‌తో దిశా పటానీ ప్రేమాయణం! నిజమెంత?

Published: 27-01-2026, 12:35 AM
షాకింగ్: పంజాబీ సింగర్‌తో దిశా పటానీ ప్రేమాయణం! నిజమెంత?
  • దిశా పటానీ పంజాబీ సింగర్ తల్విందర్‌తో డేటింగ్ చేస్తుందనే వార్తలు వైరల్.
  • చికాగోలో జరిగిన ఒక ఈవెంట్లో దిశా, తల్విందర్ చేయి పట్టుకుని కనిపించారు.
  • వీరిద్దరూ ఒకే కారులో వెళ్లడంతో డేటింగ్ రూమర్స్ నిజమయ్యాయని నెటిజన్స్ కామెంట్స్.
  • దిశా పటానీ గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో నటించింది.

బాలీవుడ్ నటి దిశా పటానీ పంజాబీ సింగర్ తల్విందర్‌తో డేటింగ్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చికాగోలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి.

దిశా పటానీ డేటింగ్ రూమర్స్

Disha Patani:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిన్నది.. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాలు ఆరబోస్తూ.. యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన ప్రియుడితో కలిసి దర్శనమివ్వడంతో డేటింగ్ రూమర్స్ నిజమేనంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దిశా పటానీ ఇప్పుడు పంజాబీ సింగర్ తల్విందర్ (Talwinder)తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా.. అవి నిజమయ్యాయి. చికాగోలో ఒక స్పెషల్ ఈవెంట్ జరిగింది. అక్కడ సింగర్ తల్విందర్ తన ప్రదర్శన ఇచ్చారు. అయితే ఈవెంట్ తర్వాత దిశా పటానీ చేయి పట్టుకొని ఆయన బయటకు వచ్చారు. అనంతరం ఒకే కారులో ఈ జంట వెళ్లిపోయింది.

తల్విందర్‌తో కలిసి దిశా?

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సింగర్ తల్విందర్ తో దిశా పటానీ డేటింగ్ లో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై దిశాపటానీ స్పందించి చెక్ పెడుతుందేమో చూడాలి.

నెటిజన్స్ కామెంట్స్ వైరల్

ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి పేరు దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాత హిందీలో ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమాలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే వరుసగా హిందీలోనే సినిమాలు చేస్తున్న దిశా పటానీ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది.

తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. పలు అవార్డులు కూడా అందుకుంది. అలా ఎమ్ ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాకి గానూ.. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులతో పాటు స్టార్ స్క్రీన్ అవార్డులు, స్టార్ డస్ట్ అవార్డులు అందుకుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డును కూడా దక్కించుకుంది.. ఇక 2018లో వచ్చిన భాగీ 2 సినిమాకి గానూ లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డును అందుకుంది. ఇక ప్రస్తుతం డేటింగ్ రూమర్స్ ఎదుర్కొంటున్న ఈమె దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దిశా పటానీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.