
📌 Key Points
- దివికి టాలీవుడ్ హీరో ప్రభాస్ అంటే విపరీతమైన అభిమానం.
- ప్రభాస్ అంటే పెళ్లి చేసుకునేంత ఇష్టమని దివి తెలిపింది.
- దివి త్వరలో ‘హనీ’ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించనుంది.
- దివి బ్రేకప్ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
బిగ్ బాస్ దివి ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసింది. ప్రభాస్ అంటే తనకు ఎంత పిచ్చో, పెళ్లి చేసుకునేంత ఇష్టమో చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో దివి ‘హనీ’ సినిమాలో కనిపించనుంది.
ప్రభాస్‌పై దివి ప్రేమ
Divi vadthya:బిగ్ బాస్ దివి పరిచయం అవసరం లేని పేరు మోడలింగ్ రంగంలో కొనసాగుతూ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దివి ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ద్వారా మొదటిసారి వెండి తెరపై తళుకుమ్మన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే సినిమాలలో ఈమె హీరోయిన్ గా కాకపోయినా కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే దివి హనీ(Honey Movie) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6 తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి దివి(Divi) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరియర్ గురించి అలాగే పలు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.. ఈ నేపథ్యంలోనే తన బ్రేకప్ గురించి కూడా ప్రశ్నలు ఎదురు కావడంతో నా బ్రేకప్ జరిగి నేను ఆల్రెడీ మూవ్ ఆన్ అయ్యాను అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరో ఎవరు అనే విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
దివి కెరీర్ విశేషాలు
ఇలా తన ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ (Prabhas)అంటే విపరీతమైనటువంటి ఇష్టమని తెలిపారు. తనపై ఎంత ఇష్టం అంటే అవకాశం వస్తే పెళ్లి చేసుకొనే అంత ఇష్టం , ప్రభాస్ తన క్రష్ అంటూ దివి ఈ సందర్భంగా ప్రభాస్ పై తనకున్నటువంటి ఇష్టాన్ని బయట పెడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈయనకు విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా దివి సైతం ప్రభాస్ అభిమాని అనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక దివి సినిమాల విషయానికి వస్తే.. బిగ్ బాస్ తరువాత దివి వరుస సినిమాలలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాలలో ఈమె పాత్రలన్నీ కూడా చిన్న చిన్న పాత్రలు కావటం విశేషం. కథ ప్రాధాన్యత ఉంటే తాను చిన్న పాత్రలలో నటించడానికి అయినా సిద్ధమేనని తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె నటించిన హాని అనే సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై హీరో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల భారీగా అంచునాలను పెంచేసింది.
‘హనీ’ మూవీ వివరాలు
దివి తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రభాస్‌పై ఆమెకున్న అభిమానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాబోయే సినిమాల కోసం ఎదురుచూద్దాం. ‘హనీ’ మూవీలో ఆమె నెగటివ్ షేడ్స్ ఎలా ఉంటాయో చూడాలి.


