
📌 Key Points
- డాన్ 3 సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని హృతిక్ స్పష్టం చేశారు.
- వ్యక్తిగత కారణాల వల్ల రణవీర్ సింగ్ డాన్ 3 నుండి తప్పుకున్నారని సమాచారం.
- రణవీర్ సింగ్ తప్పుకోవడంతో హృతిక్ రోషన్ నటిస్తారని పుకార్లు వచ్చాయి.
- సినిమా గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన వచ్చేవరకు రూమర్లను నమ్మవద్దని హృతిక్ సూచించారు.
డాన్ 3 సినిమాలో హృతిక్ రోషన్ నటించడం లేదని తేలిపోయింది. రణవీర్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవడంతో హృతిక్ నటిస్తారని పుకార్లు వచ్చాయి. దీనిపై హృతిక్ స్పందించి, తాను నటించడం లేదని స్పష్టం చేశారు.
డాన్ 3లో హృతిక్ రోషన్ నటిస్తారా?
Don 3: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయితే ఆ సినిమా ప్రాంచేజీలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా ఫ్రాంచైజీల రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఫ్రాంచైజీలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్న సినిమాలలో డాన్ సిరీస్ ఒకటి. ఇప్పటికే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే డాన్ 3(Don 3) సినిమా పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సినిమా గురించి గత కొద్దికొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి నటుడు రణవీర్ సింగ్(Ranveer Singh) తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.
ఈ సినిమా ప్రకటించే సమయంలో హీరోగా రణవీర్ సింగ్ నటిస్తున్నారని అధికారికంగా తెలియజేశారు. అయితే ఇటీవల ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల డాన్ 3 నుంచి తప్పుకోవడంతో ఈయనకు బదులుగా మరొక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)నటించబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ వార్తలపై తాజాగా హృతిక్ రోషన్ స్పందించి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు హృతిక్ రోషన్ కు ఈ ప్రశ్న ఎదురవడంతో ఆయన సమాధానం చెబుతూ..
రణవీర్ సింగ్ ఎందుకు తప్పుకున్నారు?
ఈ విధమైనటువంటి రూమర్లను సరదాగా ఎవరో ఒకరు సృష్టిస్తుంటారు. ఈ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి అయితే డాన్ 3 సినిమాలో నటించమని కోరుతూ ఇప్పటివరకు ఎవరు నా వద్దకు రాలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన ఏ విషయమైనా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్లను స్ప్రెడ్ చేయొద్దు అంటూ ఈయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా డాన్ 3 సినిమా గురించి వస్తున్నటువంటి రూమర్లపై ఈయన స్పందించి క్లారిటీ ఇవ్వడంతో హృతిక్ ఈ సినిమాలో నటించబోతున్నారంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని స్పష్టమవుతుంది.
రణవీర్ సింగ్ జోడిగా కియారా..
హృతిక్ రోషన్ ప్రకటన
ఇక ఈ సినిమా నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడా అధికారికంగా కూడా స్పందించలేదు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఈ సినిమాలో రణవీర్ జోడిగా కియారా అద్వానీ (Kiara Advani)నటిస్తున్నారు. రణవీర్ ఇటీవల దురందర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక మార్చి 19వ తేదీ ఈ సినిమా సీక్వెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో రణబీర్ ఎంతో బిజీగా ఉన్నారు.
హృతిక్ రోషన్ వివరణతో డాన్ 3 గురించి వస్తున్న పుకార్లకు తెరపడింది. చిత్రబృందం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది. ఈ సినిమాలో మార్పులు ఏమి జరుగుతాయో చూడాలి.


