|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Eesha Trailer:ఒళ్లు గగుర్పొడిచేలా ఈషా ట్రైలర్… ఇంత భయంకరంగా ఉందేంటీ!

Published: 08-12-2025, 3:50 AM
Eesha Trailer:ఒళ్లు గగుర్పొడిచేలా ఈషా ట్రైలర్… ఇంత భయంకరంగా ఉందేంటీ!
  • హర్రర్ చిత్రం ‘ఈషా’ ట్రైలర్ విడుదలయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
  • త్రిగున్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది.
  • ట్రైలర్ ప్రతిక్షణం ఉత్కంఠగా ఉందని, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • నిర్మాత బన్నీ వాసు సినిమా చూసి నాలుగుసార్లు భయపడ్డానని తెలిపారు.

త్రిగున్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలలో నటించిన హర్రర్ చిత్రం ‘ఈషా’ ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈషా ట్రైలర్ హైలైట్స్

Eesha Trailer: నటుడు త్రిగున్ , హెబ్బా పటేల్ (Hebah patel )ప్రధాన పాత్రలలో నటిస్తున్న హర్రర్ చిత్రం ఈషా(Eesha). ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ హర్రర్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.2.28 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ ప్రతిక్షణం ఎంతో ఉత్కంఠంగా భరితంగా కొనసాగిందని చెప్పాలి.

ఈ ట్రైలర్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొదుస్తుందని చెప్పాలి. హర్రర్ సినిమాలను ప్రేమించే వారికి ఇదొక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో కావాల్సినన్ని ట్విస్టులు కూడా ఉండబోతున్నాయని ఇటీవల విడుదల చేసిన టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.మీరు ఇప్పటివరకూ చూడని, ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉందనే డైలాగు సినిమా పట్ల మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు శ్రీనివాసమన్నే దర్శకత్వం వహించగా పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు.

ఈషా చిత్రం విడుదల వివరాలు

ఇక ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి సమర్పణలో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే వీరిద్దరూ లిటిల్ హార్ట్స్, రాజు రాంబాయి సినిమాలను విడుదల చేస్తూ ఎంతో అద్భుతమైన లాభాలను, విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ ఈషా సినిమాని విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి . ఇక ఈ సినిమాలో సిరి హనుమంత్, పృధ్విరాజ్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక హర్రర్ సినిమాలంటే భయపడని వాళ్లు కూడా ఈ సినిమా చూసి కచ్చితంగా భయపడతారు అంటూ ఇటీవల నిర్మాత బన్నీ వాసు సినిమా గురించి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా సినిమా పట్ల భారీ అంచనాలను పెంచేసాయి.

హర్రర్ సినిమాల షూటింగ్ సమయంలో దగ్గరుండి చూసిన తానే ఈ సినిమా చూస్తూ నాలుగు సార్లు భయపడ్డానని బన్నీ వాసు తెలిపారు. హర్రర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అలాంటివాళ్లు తప్పకుండా సినిమాకి వస్తే ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు. అయితే ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతుంటారో అలాంటివారు దయచేసి మా సినిమాకు రావద్దు అలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అంత భయంకరంగా ఈ సినిమా ఉండబోతోంది అంటూ నిర్మాత చేసిన వ్యాఖ్యలు కూడా సినిమా పట్ల భారీగానే అంచనాలను పెంచేసాయి. మరి డిసెంబర్ 12వ తేదీ రాబోతున్న ఈ హర్రర్ త్రిల్లర్ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు

‘ఈషా’ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. హర్రర్ ప్రియులకు ఈ చిత్రం గొప్ప అనుభూతినిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.