
మరో వీకెండ్ రానే వచ్చింది. ఈ శుక్రవారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాల సందడి నెలకొంది. సుధీర్ బాబు, రష్మిక చిత్రాలు థియేటర్లలోకి వస్తుండగా, ఒక్క రోజే ఏకంగా 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి. చిరంజీవ, ఏక్ చతుర్ నార్ వంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి.
Key Points
ఈ శుక్రవారం థియేటర్లలో సుధీర్ బాబు 'జటాధర', రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' విడుదల.
ఒక్క శుక్రవారమే 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి.
తెలుగులో చిరంజీవ, అర్జున్ చక్రవర్తి వంటి చిత్రాలు ఓటీటీలోకి వస్తున్నాయి.
బాలీవుడ్ నుంచి ఏక్ చతుర్ నార్ సినిమా, మహారాణి సీజన్ 4 వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయనున్నాయి.
ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసే చిత్రాలు
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలా బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి. అలా ఈ ఫ్రైడే సుధీర్ బాబు నటించిన జటాధర, రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా లాంటి చిత్రాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. వీటితో పాటు ఆర్యన్, ఫీనిక్స్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో ఒకట్రెండ్ చిత్రాలపైనే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.
వీటి సంగతి పక్కన పెడితే.. శుక్రవారం ఓటీటీల్లోనూ సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంటాయి. అలా ఈ వారంలో తెలుగులో చిరంజీవ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. బాలీవుడ్ నుంచి ఏక్ చతుర్ నార్ అనే సినిమా వస్తోంది. వీటితో పాటు పలు హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా సందడి చేయనున్నాయి. మరి ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో తెలియాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు..
ఏక్ చతుర్ నార్(హిందీ సినిమా) – నవంబరు 07
బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 07
ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబరు 07
మ్యాంగో(హాలీవుడ్ మూవీ)- నవంబరు 07
యాజ్ యూ స్టూడ్ బై-(కొరియన్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 07
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న తెలుగు, బాలీవుడ్ మూవీస్
గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07
ఆల్ హర్ ఫాల్ట్- (హాలీవుడ్ మూవీ)- నవంబరు 07
మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) – నవంబరు 07
చిరంజీవ (తెలుగు చిత్రం) – నవంబరు 07
కిస్ (తమిళ సినిమా) – నవంబరు 07
తోడే దూర్ తోడే పాస్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 07
ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి జాబితా
మహారాణి సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 07
ప్లరిబస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబరు 07
కరమ్ (మలయాళ సినిమా) – నవంబరు 07
అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) – నవంబరు 07
ద హ్యాక్ సీజన్- 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబరు 07
ఎక్కా(కన్నడ సినిమా)- నవంబరు 07
ఈ శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలతో పాటు ఓటీటీల్లో వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పెద్ద సంఖ్యలో కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. మీ అభిరుచికి తగిన చిత్రాన్ని ఎంచుకుని వీకెండ్‌ను ఆస్వాదించండి.


