
📌 Key Points
- హన్సిక, సోహైల్ విడాకులు మంజూరు చేసిన కోర్టు – నాలుగేళ్ల బంధానికి ఎండ్ కార్డ్!
- భరణం లేకుండానే విడాకులు తీసుకున్న హన్సిక నిర్ణయం సంచలనం!
- దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.
- హన్సిక, సోహైల్ మధ్య మనస్పర్థలే విడాకులకు కారణం!
టాలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సిక జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. ఆమె తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పింది. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
విడాకులు మంజూరు చేసిన కోర్టు
దక్షణాది సినీ అభిమానులకు హన్సిక గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో ఎందరో స్టార్ లతో, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హన్సిక నటించింది. హన్సికని అభిమానులు ముద్దుగా ఆమెని యాపిల్ బ్యూటీ అని పిలుస్తారు. కాగా కొంత కాలంగా హన్సిక తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
హన్సిక.. సోహైల్ అనే వ్యక్తిని 2022 డిసెంబర్ 4న వివాహం చేసుకున్నారు. కానీ నాలుగేళ్ళ లోపే వీరి వివాహ బంధం ముగిసింది. తాజాగా ముంబై బాంద్రా లోని ఫ్యామిలీ కోర్టు హన్సిక, సోహైల్ లకు విడాకులు మంజూరు చేసింది. గత కొంత కాలంగా హన్సిక, సోహైల్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీనితో వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తూ విడాకులకు కోర్టు మెట్లు ఎక్కారు.
భరణం వద్దన్న హన్సిక
కోర్టులో ఇద్దరూ మ్యూచవల్ గా విడాకులు తీసుకునేందుకు పిటిషన్ వేశారు. హన్సిక తరపున న్యాయవాది కోర్టులో.. ఇద్దరి మధ్య చిన్న విషయాలకు కూడా చాలా పెద్ద గొడవలు జరిగేవి అని.. వీరిద్దరూ కలిసి జీవించటం సాధ్యపడలేదు అని పేర్కొన్నారు. దీనితో కోర్టు ఇరువురికి విడాకులు మంజూరు చూస్తూ నిర్ణయం తీసుకుంది.
ఒకవైపు విడాకులు తీసుకుంటూ కూడా హన్సిక సంచలన నిర్ణయం తీసుకుంది. హన్సిక తన భర్త నుంచి ఎలాంటి భరణం ఆశించలేదు. భరణం అడగకుండానే ఆమె విడాకులు పొందింది. ఇటీవల సెలెబ్రిటీల విడాకుల విషయాల్లో భరణం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.
హన్సిక సినీ కెరీర్ ఒక లుక్
కానీ హన్సిక భరణం లేకుండానే విడాకులకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టీనేజ్ లోనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్ దేశముదురు చిత్రంతో హన్సిక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించారు. తొలి సినిమాతోనే యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
హన్సిక విడాకుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


