|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహేష్ బాబు గురించి అలా మాట్లాడితే అంతే సంగతులు! హరీష్ శంకర్ వార్నింగ్!

Published: 11-03-2026, 10:05 AM
మహేష్ బాబు గురించి అలా మాట్లాడితే అంతే సంగతులు! హరీష్ శంకర్ వార్నింగ్!
  • పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ కింద మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి కామెంట్ చేసిన హరీష్ శంకర్.
  • మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు చెప్పిన హరీష్ శంకర్.
  • సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల పొరపాటు జరిగిందని హరీష్ శంకర్ వెల్లడి.
  • మహేష్ బాబు తన సినిమాకు సహాయం చేశారని గుర్తు చేసుకున్న హరీష్ శంకర్.

దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ విషయంలో జరిగిన పొరపాటును ఆయన తెలియజేశారు. ఈ వివాదంపై ఆయన స్పందన ఏంటో చూద్దాం.

హరీష్ శంకర్ వివరణ ఏమిటి?

Harish shankar: హరీష్ శంకర్ పరిచయం అవసరం లేని పేరు. దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన త్వరలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా హరీష్ శంకర్ మహేష్ బాబు వివాదం గురించి కూడా స్పందించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ కింద పవన్ కళ్యాణ్ అభిమాని కామెంట్ చేస్తూ మహేష్ బాబు సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టాలి అంటూ కామెంట్ చేయడంతో హరీష్ శంకర్ “తథాస్తు”. అంటూ రిప్లై ఇచ్చారు.

ఈ విధంగా ఈయన రిప్లై ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఒక్కసారిగా ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో వెంటనే హరీష్ శంకర్ మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన అసలు ఏం జరిగిందనే విషయాలను వివరంగా తెలియచేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా పనులలో చాలా బిజీగా ఉన్నానని నిద్ర లేకుండా సినిమా కోసం పనిచేస్తూ బిజీగా ఉన్నానని తెలిపారు.

మహేష్ బాబుతో వివాదంపై స్పందన

ఒకవైపు సెన్సార్ కార్యక్రమాలు చూసుకుంటూనే మరోవైపు థర్డ్ సింగిల్ ప్రోమో చెక్ చేసి రెడీ చేయాల్సి ఉంది ఆ సమయంలోనే దారిలో వెళ్తూ అభిమాని పెట్టిన కామెంట్ పూర్తిగా చదవకుండా తాను మెసేజ్ చేశాను అయితే ఈ రిప్లై ఇచ్చిన  సెకండ్ల వ్యవధిలోనే తన పిఆర్ టీమ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో వెంటనే డిలీట్ చేశాను అలాగే మహేష్ బాబు అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పానని తెలిపారు. మహేష్ బాబు గారిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదు ఆయన అంటే నాకు చాలా గౌరవం. మహేష్ బాబుకు ఏమాత్రం సంబంధం లేకపోయినా నా సినిమా గద్దల కొండ గణేష్ కు సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తూ భారీగా సహాయం చేశారు.

మహేష్ బాబును అంటే కళ్ళు పోతాయి..

క్షమాపణ చెప్పడానికి కారణం ఏంటి?

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కి నా సినిమా గురించి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఈ సినిమా గురించి రియాక్ట్ అవడంతో పర్సనల్ గా నేను మహేష్ బాబు గారిని కలిసి మా సినిమా గురించి పోస్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాను. ఇలా ఇతర సినిమాలకు సహాయం చేసే గొప్ప మనసు ఉన్న మహేష్ బాబు గురించి అలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగానే కళ్ళు పోతాయని హరీష్ శంకర్ ఆ కామెంట్ విషయంలో ఏం జరిగిందనే వివరాలను  తెలియచేయడంతో ఈ వివాదానికి పూర్తిగా చెక్ పెట్టినట్టే అయిందని చెప్పాలి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై హరీష్ శంకర్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

మొత్తానికి హరీష్ శంకర్ పొరపాటుగా చేసిన కామెంట్ కు వివరణ ఇస్తూ మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన మహేష్ బాబు పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.