
📌 Key Points
- నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు, కృష్ణాజిల్లా చల్లపల్లిలో జన్మించారు.
- దర్శకుడు బాపూ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, 4000 రూపాయలు మొదటి రెమ్యూనరేషన్‌గా అందుకున్నారు.
- వరల్డ్ స్పేస్ సాటిలైట్ ఛానల్లో ‘నాన్ స్టాప్ నాని’ అనే ప్రోగ్రాం ద్వారా రేడియో జాకీగా పనిచేశారు.
- ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. ఆయన సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
నాని అసలు పేరు, బాల్యం గురించి తెలుసా?
HBD Nani: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని(Nani ) కూడా ఒకరు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఈయన అసలు పేరేంటి? ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నానికి ఈ క్రేజ్ లభించడం వెనుక ఉన్న కష్టం ఏంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి నాని బర్తడే స్పెషల్ సందర్భంగా ఆయన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.
1984 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా చల్లపల్లిలో జన్మించారు. ఈయన అసలు పేరు ఘంటా నవీన్ బాబు. తల్లిదండ్రులు హైదరాబాదులో సెటిల్ అవ్వడంతో నాని స్టడీస్ మొత్తం ఇక్కడే సాగింది. సిటీలోని సెయింట్ అల్ఫోన్సా హైస్కూల్లో స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈయన.. ఎస్ఆర్ నగర్ లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత సినిమాల మీద ఆసక్తితో డైరెక్టర్ అవ్వాలనుకున్నా.. ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడు బాపూ దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంటులో జాయిన్ అయ్యారు.. రాధాగోపాలం చిత్రానికి ఏడిగా పనిచేసిన ఈయన.. అసిస్టెంట్ డైరెక్టర్గా 4000 రూపాయలను తన మొదటి రెమ్యూనరేషన్ గా అందుకున్నారు.
సినిమా అవకాశాల కోసం నాని చేసిన ప్రయత్నాలు
2005లో కే రాఘవేంద్రరావు వద్ద అల్లరి బుల్లోడు, 2007లో శ్రీను వైట్ల ఢీ వంటి చిత్రాలకు నాని పనిచేశాడు. అయితే సొంతంగా స్క్రిప్ట్స్ రాసుకోవాలనే ఉద్దేశంతోనే కొంత బ్రేక్ తీసుకున్న ఈయన.. ఫ్రెండ్ సలహా మేరకు వరల్డ్ స్పేస్ సాటిలైట్ ఛానల్లో రేడియో జాకీగా చేరాడు. అక్కడ ఆర్జేగా ఏడాది పాటు “నాన్ స్టాప్ నాని” అనే ప్రోగ్రాం చేశారు. ఇక అనుకోకుండానే ఆ సమయంలో సినిమాల్లో అవకాశాలు లభించాయి. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘అష్టా చమ్మా’ సినిమాలో నటించే అవకాశం లభించింది. అలా రేడియో జాకీగా మొదలైన ఆయన ప్రయాణం ఆ తర్వాత హీరోగా మారింది. ఇక 2008లో నాని హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు..
హీరోగా నాని సినీ ప్రస్థానం ఎలా మొదలైంది?
ఒకవైపు నటుడిగా పలు సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన మరొకవైపు కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలో నిర్మిస్తున్నారు. ఎక్కువగా చిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మాతగా సక్సెస్ అవుతున్నారు.. ఏది ఏమైనా నాని కెరియర్లో ఈ స్థాయికి రావడం వెనుక పడ్డ కష్టం ఎవరికి బయటకు తెలియకపోయినా.. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
నాని నేడు ఒక స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ, ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన రేడియో జాకీగా జీవితాన్ని ప్రారంభించి, నేడు టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.


