
📌 Key Points
- అమెరికాను టార్గెట్ చేస్తే వదిలేది లేదని ఇరాన్ హెచ్చరిక.
- కంటికి కన్ను కాదు, తల తీస్తామని ఇరాన్ IRGC జనరల్ మొహసిన్ రెజాయి హెచ్చరించారు.
- తమ స్థావరాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది.
- ఆంక్షలు ఎత్తివేసి నష్టపరిహారం చెల్లిస్తేనే ఘర్షణలు ఆగుతాయని ఇరాన్ స్పష్టీకరణ.
ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాను టార్గెట్ చేస్తే వదిలేది లేదని ఇరాన్ పదే పదే హెచ్చరిస్తోంది.
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ మేరకు ఇప్పటికే ట్రంప్ నుంచి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇరాన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తమను టార్గెట్ చేసిన అమెరికాను వదిలేది లేదంటూ పదే పదే వార్నింగులు ఇస్తోంది ఇరాన్. ఇక లేటెస్ట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి మరో వార్నింగ్ ఇచ్చింది ఇరాన్.
దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
కంటికి కన్ను కాదు.. కంటికి తల తీస్తామంటూ ఇరాన్ IRGC జనరల్ మొహసిన్ రెజాయి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ స్థావరాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమెరికా షిప్పులను గల్ఫ్ లో ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆంక్షలు ఎత్తేసి, నష్ట పరిహారం చెల్లిస్తేనే ఘర్షణలు ఆగుతాయని స్పష్టం చేశారు. అమెరికాను కాపాడుకునేందుకు ఎక్కువ సమయం లేదని కూడా కుండబద్దలు కొట్టారు. దీంతో ఇరాన్ IRGC జనరల్ మొహసిన్ రెజాయి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి
A post shared by Indialinked (@indialinked)
ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శాంతియుత పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.


