|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్! యూకే మీడియా సంచలన ప్రకటన!

Published: 12-03-2026, 3:05 PM
షాకింగ్: కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్! యూకే మీడియా సంచలన ప్రకటన!
  • ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు యూకే మీడియా సంచలన ప్రకటన చేసింది.
  • మొజ్తబా ఖమేనీ కాలు కోల్పోయారని, పొట్ట, లివర్‌కు తీవ్ర గాయాలయ్యాయని యూకే మీడియా తెలిపింది.
  • ఖమేనీ కోమాలో ఉన్నాడని వార్తలు వస్తున్నా, హర్ముజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రకటించింది.
  • మార్చి 3న ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు.

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారంటూ యూకే మీడియా సంచలన ప్రకటన చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, ఒక కాలు కూడా కోల్పోయారని పేర్కొంది. ఈ వార్త ఇరాన్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఖమేనీ కోమాలో ఉన్నట్లు యూకే మీడియా ప్రకటన

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యూకే మీడియా షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖ‌మేనీ కోమాలో ఉన్నాడని పేర్కొంది యూకే మీడియా. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖ‌మేనీ ఒక కాలు కోల్పోయారని కూడా పేర్కొంది. పొట్ట, లివర్ కు తీవ్రంగా మొజ్తాబా ఖ‌మేనీకి గాయాలు అయినట్లు స్పష్టం చేసింది. అయితే, మొజ్తాబా ఖ‌మేనీ ఏ విధంగా గాయపడ్డారనే విషయాన్ని యూకే మీడియా స్పష్టం చేయలేదు. కానీ కోమాలో ఉన్నాడని పేర్కొంది.

అసలు అలీ ఖ‌మేనీ చనిపోయిన రోజే ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖ‌మేనీ గాయపడ్డాడా ? లేక మరో చోట దాడి జరగగా అక్కడ గాయపడ్డారా ? అనే వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మొజ్తాబా ఖ‌మేనీ కోమాలో ఉన్నాడన్న వార్త బయటకు రాగానే ఇరాన్ ప్రభుత్వ టీవీ సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేది లేదని మొజ్తాబా ఖ‌మేనీ హెచ్చరించాడని ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అయితే కోమాలో ఉన్న వ్యక్తి ఎలా ఇలాంటి వార్నింగులు ఇస్తారని చర్చ జరుగుతోంది. దీంతో కోమాలో ఉన్నప్పటికీ అమెరికాకు మొజ్తాబా ఖ‌మేనీ వార్నింగ్ ఇచ్చారని బ్రిటన్ మీడియా సెటైర్లు కూడా పేల్చింది. కాగా మార్చి 3వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్య‌త‌లు తీసుకున్నాడు మొజ్తాబా ఖ‌మేనీ. ఫిబ్రవ‌రి 28వ తేదీన అలీ ఖ‌మేనీ, ఇజ్రాయెల్ దాడుల్లో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

గాయాలపాలైన ఇరాన్ సుప్రీం లీడర్

కోమాలో ఉన్నా హెచ్చరికలు జారీ చేసిన ఖమేనీ?

మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి. అంతర్జాతీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.