|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

200 కోట్ల కేసుల సుడిగుండం వీడి.. టాలీవుడ్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంచలనం! సీక్రెట్ షూటింగ్ వివరాలు!

Published: 03-04-2026, 10:05 AM
200 కోట్ల కేసుల సుడిగుండం వీడి.. టాలీవుడ్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంచలనం! సీక్రెట్ షూటింగ్ వివరాలు!
  • బాలీవుడ్ గ్లామర్ డాల్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ.
  • డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా.
  • డార్జిలింగ్ కొండల్లో సీక్రెట్ షూటింగ్, రిస్కీ యాక్షన్ సీక్వెన్స్.
  • సుకేశ్ చంద్రశేఖర్ కేసులో రూ. 10 కోట్ల విలువైన బహుమతులు అందుకున్న జాక్వెలిన్.

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె జయశంకర్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్రెట్ షూటింగ్ డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

టాలీవుడ్‌లోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్రాండ్ ఎంట్రీ

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్..బాలీవుడ్ గ్లామర్ డాల్ గా క్రేజ్ కొట్టేసిన ఈ శ్రీలంకన్ బ్యూటీ ఇపుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవ్వడం హాట్ టాపిక్ అయిపొయింది.ఇప్పటివరకు హిందీ సినిమాలతో నార్త్ ఇండియాను షేక్ చేసిన ఈ అమ్మడు ఇపుడు ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమాతో సౌత్ ఇండియాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అయితే, జాక్వెలిన్ పేరు గత కొంతకాలంగా సినిమాల కంటే ఎక్కువగా రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులోనే ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెల్సిందే.అలా కాంట్రవర్సీలతో సావాసం చేసిన జాక్వెలిన్ ఇపుడు టాలీవుడ్ బాట పట్టడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ .

పేపర్ బాయ్’, ‘అరి’ సినిమాలని తీసిన  డైరెక్టర్ జయశంకర్

ఇక ఈ సినిమాకి ‘పేపర్ బాయ్’, ‘అరి’ సినిమాలని తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ జయశంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లోని మంచు కొండల్లో సీక్రెట్ గా షూట్ చేసుకుంటుందని,ఇందులోజాక్వెలిన్ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ లని డూప్ లేకుండా చేస్తుందని సమాచారం.

డార్జిలింగ్‌లో సీక్రెట్‌గా షూటింగ్

10 కోట్ల విలువైన బహుమతులను ఆమె అందుకున్న జాక్వెలిన్

ఇక జాక్వెలిన్ డార్క్ షేడ్ వైపు ఓ కన్నేస్తే సుకేశ్ చంద్రశేఖర్‌తో ఆమెకు ఉన్న రిలేషన్ అటు ఇండస్ట్రీని, ఇటు పాలిటిక్స్ ని ఒక్క సారిగా షేక్ చేసింది.సుకేశ్ తనను తాను పెద్ద రాజకీయ నాయకుడి బంధువునని నమ్మించి, ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ అదితి సింగ్ నుండి సుమారు రూ. 200 కోట్లు వసూలు చేశాడు. ఈ దోచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని జాక్వెలిన్‌కు ఖరీదైన గిఫ్టుల రూపంలో, ఇచ్చాడని ఈడీ (ED) గుర్తించింది.అందులో కోట్లాది రూపాయల డైమండ్ నెక్లెస్ లు, పారిన్ పిల్లులు, రూ. 52 లక్షల కాస్ట్లీ గుర్రంతో పాటు లగ్జరీ కార్లు అంటూ దాదాపు రూ. 10 కోట్ల విలువైన బహుమతులను ఆమె అందుకున్నట్లు ఈడీ ఛార్జ్ షీట్‌లో ఫైల్ చేసింది.

200 కోట్ల కేసులో చిక్కుకున్న జాక్వెలిన్

విదేశాలకు వెళ్లాలంటే  కోర్టు పర్మిషన్ కంపల్సరీ

ఇక ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొన్న ఈడీ, సుకేశ్ నేరస్తుడని తెలిసి కూడా ఆమె బహుమతులు స్వీకరించిందని ఆరోపించింది. అయితే, తాను కూడా సుకేశ్ చేతిలో మోసపోయానని జాక్వెలిన్ కోర్టులో వాదించడం విశేషం. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం కోర్టు పర్మిషన్ కంపల్సరీ. అనుమతి తప్పనిసరి.ఏది ఏమైనా ఇన్ని కాంట్రవర్సీ ల మధ్యలో కూడా జాక్వెలిన్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం టాలీవుడ్ దిక్కు చూడటం విశేషం. మరి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఆమె సరసన నటించే ఆ ‘స్టార్ హీరో’ ఎవరు? సినిమా టైటిల్ ఏంటి అన్న విషయాలని త్వరలో అయినా రివీల్ చేస్తారేమో చూడాలి !

మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నప్పటికీ, జాక్వెలిన్ టాలీవుడ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.