|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘జైలర్ 2’కు షాక్: గెస్ట్ రోల్స్ బెడిసి కొట్టాయా? రజినీ సినిమాకు కొత్త కష్టాలు!

Published: 08-04-2026, 1:35 PM
‘జైలర్ 2’కు షాక్: గెస్ట్ రోల్స్ బెడిసి కొట్టాయా? రజినీ సినిమాకు కొత్త కష్టాలు!
  • జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 వస్తున్నట్లు ప్రకటన.
  • షారుక్ ఖాన్ డేట్స్ సమస్యల వల్ల జైలర్ 2 నుండి తప్పుకున్నాడు.
  • బాలకృష్ణకు పాత్ర నచ్చకపోవడంతో ఇంకా నిర్ణయం పెండింగ్ లో పెట్టారు.
  • విజయ్ సేతుపతి విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ భారీ విజయం సాధించింది. ఇప్పుడు జైలర్ 2లో గెస్ట్ రోల్స్ కోసం స్టార్స్ ని సంప్రదించగా సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.

గెస్ట్ రోల్స్ తో చిక్కుల్లో జైలర్ 2

Jailer 2: పేట, దర్బార్, అన్నాత్తే అంటూ వరుస ప్లాపులతో సక్సెస్ కి దూరంగా జరిగిపోయిన రజిని కాంత్ కెరీర్ కి ఊపు తెచ్చిన సినిమా జైలర్. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లపై చిలుకు కొల్లగొట్టి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు తలైవా.ఇక ఈ కాంబోలో జైలర్ కి సీక్వెల్ గా జైలర్ 2 వస్తుందన్న వార్తలు రావడంతో మురిసిపోయారు తలైవా ఫ్యాన్స్.

గెస్ట్ రోల్స్ విషయంలో లెక్కలు తారుమారు

అలా భారీ అంచనాలు పెట్టేసుకున్న ఈ సినిమా ఇపుడు పెద్ద కాస్టింగ్ ఫాజిల్ లో చిక్కుకున్నట్టే కనిపిస్తుంది. అవును..ఒకవైపు రజనీకాంత్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయడానికి రెడీ గా ఉన్నా సినిమాలో ఉండాల్సిన గెస్ట్ రోల్స్ విషయంలో మాత్రం లెక్కలు తారుమారవుతున్నాయి.నిజానికి జైలర్ అంతటి సాలిడ్ హిట్ అవ్వడానికి కారణం ఆ గెస్ట్ రోల్సే. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి టాప్ స్టార్స్ చేసిన క్యామియోలకి థియేటర్లు షేక్ అయ్యాయ్. దీంతో మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి నెల్సన్ ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్టార్స్ ని స్టోరీలో పార్ట్ అయ్యేలా కథని వండి వార్చాడు. అయితే ఇపుడు ఆ ప్లానింగే సినిమాకి పెద్ద అడ్డంకిగా మారినట్టు కనిపిస్తుంది.మొన్నటిదాకా ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయింది.

షారుక్ ఖాన్ నో చెప్పడానికి కారణం?

డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్న షారుక్

అయితే తన నెక్స్ట్ ఫిలిం కింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న షారుక్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది.ఒకరకంగా షారుక్ క్యామియోతో నార్త్ బెల్ట్ లో పాగా వేయాలన్న నెల్సన్ ప్లాన్ కి బ్రేక్ పడినట్టే అని చెప్పాలి.ఇక టాలీవుడ్ నటసింహం,మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను ఈ చిత్రంలో క్యామియో రోల్ వేయించాలని ఏకంగా రజినీనే సంప్రదించాడన్న వార్త  ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచింది.కానీ బాలయ్య తనకు ఇచ్చిన పాత్ర నచ్చకపోవడంతో  ఎలాంటి డిసీషన్ తీసుకోకుండా ప్రాజెక్ట్ ని పెండింగ్ లో పెట్టాడని ఫిలిం సర్కిల్స్ వినిపిస్తున్న టాక్.ఇక  వీరితో పాటు విజయ్ సేతుపతి వంటి స్టార్ల విషయంలోనూ ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఫుల్  ప్రెజర్ లో ఉన్నాడట డైరెక్టర్ నెల్సన్. జైలర్ కి అడ్వాంటేజ్ అయిన క్యామియోలు సెకండ్ పార్ట్ లో మిస్ అయితే  ‘జైలర్ 2’ కేవలం రొటీన్ మాస్ సినిమాగా మిగిలిపోతుందేమోనన్న భయం నెల్సన్ కి పట్టుకుంది కాబోలు అన్న కామెంట్స్ నెట్టింట కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్.

బాలకృష్ణ పెండింగ్ నిర్ణయం వెనుక అసలు కారణం?

డిసెంబర్ 12కు పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్

ఇక ఈ క్యామియో కాస్టింగ్ తిప్పలు అటు తిరిగి సినిమా రిలీజ్ పై ఎఫెక్ట్ చూపేలా ఉన్నాయట. గత ఏడాది జైలర్ రిలీజ్ అయిన ఆగస్ట్ సెంటిమెంట్‌నే ఫాలో అవుదామనుకున్న నెల్సన్‌కు ఇప్పుడు కాలం కలిసి రానట్టే కనిపిస్తుంది.ఇక  కాస్టింగ్ కన్ఫర్మ్ కావడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల షూటింగ్ వెనక్కి జరిగి, సినిమాను అక్టోబర్ దీపావళి సీజన్‌కు లేదా సూపర్ స్టార్ పుట్టినరోజైన డిసెంబర్ 12కు పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు ఇపుడు పుష్కలంగా కనిపిస్తున్నాయ్. చూడాలి మరి ఈ క్యాస్టింగ్ ఫజిల్ సాల్వ్ అయిపోయి రజనీకాంత్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తనదైన మ్యాజిక్ చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.

జైలర్ 2లో గెస్ట్ రోల్స్ సమస్యలు సృష్టిస్తే సినిమా సాధారణంగా మిగిలిపోతుంది. దర్శకుడు నెల్సన్ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.