|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జైలర్ 2 vs ఫౌజీ: రజనీకాంత్, ప్రభాస్ పండగ పోటీ.. విడుదల తేదీపై ఉత్కంఠ!

Published: 15-12-2025, 7:08 AM
జైలర్ 2 vs ఫౌజీ: రజనీకాంత్, ప్రభాస్ పండగ పోటీ.. విడుదల తేదీపై ఉత్కంఠ!
  • రజనీకాంత్ ‘జైలర్ 2’ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తోంది.
  • ‘జైలర్ 2’ 2026 ఆగస్టు 14న విడుదల కానున్నట్లు సమాచారం.
  • ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా ఆగస్టు 16, 2026న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
  • ‘ఫౌజీ’ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో తెరకెక్కుతోంది.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదల తేదీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా 2026 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, ప్రభాస్ ‘ఫౌజీ’ కూడా ఆగస్టు 16న విడుదల అయ్యే అవకాశం ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల మధ్య భారీ పోటీ నెలకొనబోతోంది.

రజనీకాంత్ జైలర్ 2: విడుదల తేదీ అంచనాలు

Jailer 2 Release: కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే . ఇటీవల ఈయన కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2(Jailer 2) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జైలర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వల్ గా జైలర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది ఇదే తేదీన రజనీకాంత్ లోకేష్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే సరిగ్గా ఏడాదికి జైలర్ 2 కూడా విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోంది. ఇకపోతే 2026 ఆగస్టులో ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ (Fauzi)సినిమాని కూడా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ఫౌజీ: భారీ పీరియాడికల్ డ్రామా

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు . ఇక ప్రభాస్ ఇమాన్వి జంటగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని ఆగస్టు 16వ తేదీ విడుదల చేయబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇలా ప్రభాస్, రజనీకాంత్ సినిమాలు పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల విడుదల తేదీల గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు.

ఈ సినిమాల విడుదల గురించి త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా1940ల కాలం నాటి యుద్ధ నేపథ్యంతో రాబోతున్న భారీ పీరియాడికల్ డ్రామాగా, సుభాష్ చంద్రబోస్ జీవితం నుంచి ప్రేరణ పొందిన కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. ఇలా ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్న నేపథ్యంలోనే ఈ సినిమాని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి మరి ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక రజనీకాంత్ జైలర్ 2తోపాటు కమల్ హాసన్ నిర్మాణంలో మరో సినిమాకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పార్కింగ్ సినిమా డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది.

ఆగస్టు 2026: స్టార్ హీరోల బాక్సాఫీస్ పోరు?

రజనీకాంత్ ‘జైలర్ 2’, ప్రభాస్ ‘ఫౌజీ’ విడుదల తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఈ ఇద్దరు దిగ్గజాల సినిమాలు పోటాపోటీగా రాబోతున్నాయన్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.