|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జననాయగన్’: విడుదలకు అడ్డంకులు తొలగినట్టేనా? ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్?

Published: 06-02-2026, 11:05 AM
విజయ్ 'జననాయగన్': విడుదలకు అడ్డంకులు తొలగినట్టేనా? ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్?
  • విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల వాయిదా పడింది.
  • ఫిబ్రవరి 20న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
  • సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్ సమర్పించి కోర్టు కేసులను వెనక్కి తీసుకోనున్నారు.
  • విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

విజయ్ దళపతి నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఫిబ్రవరి 20న ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విడుదలకు సిద్ధమైన జననాయగన్

Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి(Vijay Thalapathy) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జననాయగన్ (Jananayagan). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవడంతో ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు.. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై అభిమానులు కూడా ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఈ సినిమా వివాదం మద్రాస్ హైకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగుల వివాదంతో ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఎన్నో అవాంతరాలను దాటుకొని విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 20 వ తేదీ విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు సమాచారం. చిత్రం నిర్మాతలు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారని త్వరలోనే విడుదల తేదీ అధికారకంగా వెల్లడి కాబోతోందని తెలుస్తోంది. చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్ సమర్పించి అనంతరం కోర్టు కేసులను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నారట. ఇలా చిత్ర నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సినిమా విడుదలకు ఆటంకాలన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది.

ఫిబ్రవరి 20న విడుదల?

సరికొత్త వెర్షన్ తో సెన్సార్ బోర్డుకు సమర్పించడంతో సెన్సార్ బోర్డు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఫిబ్రవరి 20వ తేదీ గ్రాండ్ రిలీజ్ కాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మరొక నటి మమిత బైజు విజయ్ కూతురి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటిలోకి కూడా రావాల్సి ఉండగా ఈ ఆటంకాలు కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఇలా విడుదల ఆలస్యం కావడంతో కేవీఎన్ ప్రొడక్షన్ వారికి భారీ స్థాయిలో నష్టాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.. ఇక విజయ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా చుట్టూ రాజకీయ వివాదం నెలకొందని తెలుస్తోంది. ఇక విజయ్ జననాయగన్ సినిమా తన కెరియర్లో ఆఖరి సినిమా అంటూ తెలియజేశారు. ఈ సినిమా అనంతరం ఈయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆఖరి సినిమా కావడంతో ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

నటీనటులు, సాంకేతిక వర్గం

జననాయగన్ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 20న విడుదల కానుందనే వార్తతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. అన్ని అడ్డంకులు తొలగి సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.