|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జాను లిరీ షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటానని మరో వీడియో విడుదల

Published: 03-05-2025, 5:55 AM
జాను లిరీ షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటానని మరో వీడియో విడుదల

సోషల్ మీడియాలో పాపులర్‌గా ఉన్న జాను లిరీ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌తో తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలిపింది. ఆమె ఆత్మహత్యాయత్నం గురించి ప్రస్తావించడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాజాగా విడుదలైన వీడియోలో ఆమె షాకింగ్ నిర్ణయం ప్రకటించింది.

Key Points

1

జాను లిరీ ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

2

ఆత్మహత్యాయత్నం గురించి ప్రస్తావించింది, తర్వాత రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.

4

ట్రోలింగ్‌కు సమాధానం చెప్పడానికి పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.

ఆన్‌లైన్ ట్రోలింగ్‌తో జాను లిరీ ఆవేదన

తెలంగాణ ఫోక్ సాంగ్స్, డాన్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన డాన్సర్ జాను లిరీ (Janu Lyri) తనపై జరుగుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్, యూట్యూబ్ ఛానెల్స్‌లో తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆవేదన చెందింది. దీంతో తనకు ఆత్మహత్య చేసుకుంటానని, తన ఆత్మహత్యకు సోషల్ మీడియాలో తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారే కారణమని చెప్పుకొచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఆమె అభిమానులు, స్నేహితులూ జాను లారీ తో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఫోన్ ఎత్తక పోవడంతో అంతా ఆందోళన చెందుతున్న క్రమంలో జాను లిరీ మరో షాకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

తాజా వీడియోలో జాను మాట్లాడుతూ.. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చూసి తాను మానసికంగా కుంగిపోయానని, తన వీడియోకు చాలామంది బాధపడుతూ.. తనకు సపోర్టుగా నిలిచారని అన్నారు. అలాగే తాను చాలాకాలంగా ఇలాంటివి చూస్తూనే ఉన్నానని, తన కొడుకు, ఫ్యామిలీ కోసం స్ట్రాంగ్ గా నిలబడతానని చెప్పారు. తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ చాలా రోజులగా తాను అన్ని గమనిస్తూనే ఉన్నానని, తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని ఇకపై ఎలాంటి ట్రోల్స్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తానని అన్నారు. అలాగే అంతా తన పెళ్లి గురించే చర్చించుకుంటున్నారని, తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, తన కొడుకుతో కలిసి మంచి జీవితంతో పాటు సంతోషంగా గడుపుతూ.. తనను ట్రోల్ చేసిన వారికి గట్టి సమాధానం చెబుతామని తాజా వీడియోతో జాను లిరీ పెళ్లిపై క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆత్మహత్య ప్రయత్నం గురించి ప్రస్తావన

రెండో పెళ్లి ప్రకటనతో ఆశ్చర్యం

జాను లిరీ తన కష్టాలను ఎదుర్కొంటూ, తన కుటుంబం కోసం బలంగా నిలబడాలని నిర్ణయించుకుంది. రెండో పెళ్లి ద్వారా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.