
📌 Key Points
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
- ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలనలో ఉంది, తుది టైటిల్ ప్రకటన త్వరలో ఉంటుంది.
- రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమాకు పరిశీలిస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది.
- రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా టైటిల్ తమ హీరోకు వద్దని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే, రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా విశేషాలు
Jr.NTR -Prashanth Neel: ప్రశాంత్ నీల్ పరిచయం అవసరం లేని పేరు. కే జి ఎఫ్ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా పాన్ ఇండియా స్థాయిలో ఈయన పేరు మారుమోగిపోయింది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో ఒక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్(Dragon) అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయలేదని ఈ సినిమాకు మరో టైటిల్ కూడా ఉండబోతుందని త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఈ టైటిల్ ప్రకటించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే విషయంపై కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ సినిమాకు రామ్ చరణ్ నటించిన సినిమా టైటిల్ పెట్టబోతున్నారని వార్త వైరల్ అవడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానులు షాక్ అవుతున్నారు.
రామ్ చరణ్ టైటిల్ పుకార్లు
సాధారణంగా ఒక హీరో సినిమాకు పెట్టిన టైటిల్ ఒక దశాబ్దం తర్వాత వేరొక సినిమాకు ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇదివరకు స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ఇటీవల యంగ్ హీరోలు వారి సినిమాలకు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ (Ramcharan)హీరోగా నటించిన బ్రూస్ లీ (Bruce Lee)సినిమా కూడా 2015 వ సంవత్సరంలో విడుదల అయింది. ఇలా ఈ సినిమా విడుదలయి దశాబ్ద కాలం పూర్తి కావడంతో ఈ సినిమా టైటిల్ ను ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు పెట్టాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారని దాదాపు ఈ టైటిల్ కన్ఫామ్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్?
అభిమానుల స్పందన
ఇలా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు రాంచరణ్ సినిమా టైటిల్ పెట్టబోతున్నారని విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారి షాక్ అవుతూ అభిమాన హీరో సినిమాకు రామ్ చరణ్ డిజాస్టర్ సినిమా టైటిల్ పెట్టడం ఏంటి? అంటూ తనదైన శైలిలోనే స్పందిస్తున్నారు. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమా విదేశాలలో యాక్షన్ సన్ని వేషాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా, అనిల్ కపూర్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమాకు రామ్ చరణ్ సినిమా టైటిల్ వద్దని కోరుకుంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


