
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రెండు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Key Points
త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించే సినిమాకు రెండు హీరోయిన్లు
సాయి పల్లవి ఒక హీరోయిన్ గా చర్చలు జరుగుతున్నాయి
ఈ సినిమా మైథలాజికల్ జోనర్ లో ఉంటుందని ప్రచారం
నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా
జూనియర్ ఎన్టీఆర్ (NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో… అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే చాలా మంచి విజయాలను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్… ఇటీవల దేవర సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఎన్టీఆర్.
రెండు హీరోయిన్లతో సినిమా?
అయితే… ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు నాగ వంశీ నిర్మాతగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా… మైథాలజికల్ జోనర్ లో రాబోతున్నట్లు చెబుతున్నారు. భగవంతుడు కార్తికేయ ఆధారిత కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు.
సాయి పల్లవి సినిమాలో నటించే అవకాశం?
అయితే.. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది క్లారిటీ రాలేదు. కానీ ఇందులో సాయి పల్లవిని ( Sai Pallavi)మాత్రం తీసుకుంటారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా రావాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. రెండు హీరోయిన్లు, మైథాలజికల్ కథాంశం.. మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి.


