|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కల్కి 2 టైటిల్ మారింది! కర్ణుడితో లింక్ పెట్టిన డైరెక్టర్, ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే!

Published: 02-04-2026, 11:05 AM
షాకింగ్: కల్కి 2 టైటిల్ మారింది! కర్ణుడితో లింక్ పెట్టిన డైరెక్టర్, ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే!
  • ప్రభాస్ ‘కల్కి 2898 AD’ కలెక్షన్ల సునామీ: రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు!
  • సీక్వెల్‌లో కర్ణుడిగా ప్రభాస్: దర్శకుడు నాగ్ అశ్విన్ సంచలన ట్విస్ట్!
  • టైటిల్ మార్పు: ‘కల్కి 2’ కాదు, ఇప్పుడు ‘కర్ణ 3102 BC’గా వస్తుంది!
  • 2027లో ‘కర్ణ 3102 BC’ విడుదల: అశ్వత్థామతో కర్ణుడి పోరాటం చూడాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ మారబోతోందట. అసలు విషయం ఏమిటో చూద్దాం రండి!

కల్కి సీక్వెల్‌కు కర్ణ టైటిల్?

Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన కురుక్షేత్ర ఘట్టాలు, మహాభారత నేపథ్యం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి.

మొదటి భాగం ముగింపులో ప్రభాస్ పాత్ర ‘కర్ణుడు’ అని రివీల్ చేసి సీక్వెల్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇక అప్పటి నుండి ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే, ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ తెరపైకి వస్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సీక్వెల్ కి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.

భవిష్యత్తు నుండి భూతకాలానికి ప్రయాణం!

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సీక్వెల్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం ఈ సీక్వెల్ ను ‘కల్కి 2(Kalki 2)’గా పిలుస్తూ వచ్చారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ కి టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండవ భాగానికి మేకర్స్ ‘కర్ణ 3102 BC’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి భాగం భవిష్యత్తు కాలం (2898 AD) చుట్టూ తిరిగితే, రెండవ భాగం ఎక్కువగా గతాన్ని, అంటే ద్వాపర యుగ ముగింపు సమయాన్ని (3102 BC) ఆవిష్కరించబోతోందని తెలుస్తోంది.

కర్ణుడు – కల్కి అవతారం: అసలు లింక్ ఇదేనా?

ఈ సీక్వెల్ ప్రధానంగా కర్ణుడి పునర్జన్మ, అశ్వత్థామ పాత్రల మధ్య సాగే సంఘర్షణ నేపథ్యంలో ఉంటుందని టాక్. కర్ణుడి అసంపూర్ణ గాథను, అశ్వత్థామ విముక్తిని ఈ సినిమాలో నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించనున్నారట. కల్కి అవతారానికి, కర్ణుడికి ఉన్న సంబంధం ఏమిటనేది ఈ ‘కర్ణ 3102 BC’లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒకవేళ ఇదే టైటిల్ ఖరారైతే, మెగా ప్రాజెక్ట్ రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమని అభిమానులు ఖుషీ అవుతున్నారు. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తానికి ‘కల్కి 2’ టైటిల్ మార్పుతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కర్ణుడు, కల్కి మధ్య సంబంధం ఎలా ఉండబోతుందో చూడడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.