|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెరికాకు కమల్ స్ట్రాంగ్ వార్నింగ్: మీ పనేదో మీరు చూసుకోండి! సంచలన లేఖ వైరల్!

Published: 08-03-2026, 3:35 AM
అమెరికాకు కమల్ స్ట్రాంగ్ వార్నింగ్: మీ పనేదో మీరు చూసుకోండి! సంచలన లేఖ వైరల్!
  • రష్యా చమురు కొనుగోలుపై అమెరికా భారత్‌కు 30 రోజుల తాత్కాలిక మినహాయింపు.
  • భారత్‌ను ఆదేశించే అధికారం అమెరికాకు లేదని కమల్ హాసన్ లేఖలో పేర్కొన్నారు.
  • భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది.
  • ప్రపంచ శాంతి కోసం రెండు దేశాల మధ్య గౌరవం అవసరమని కమల్ అభిప్రాయపడ్డారు.

రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారతీయ రిఫైనరీలకు అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇవ్వడంపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్‌కు అమెరికా ఆంక్షలు: కమల్ హాసన్ ఆగ్రహం

Kamal Letter: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారతీయ రిఫైనరీలకు అమెరికా కేవలం 30 రోజుల పాటు మాత్రమే ‘తాత్కాలిక’ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించడంపై నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. అసలు భారత్ ను ఆదేశించడనికి అసలు మీరు ఎవరు అంటూ విరుచుకు పడ్డారు.

Read also- Cheapest Annual Plan: చీపెస్ట్ 365 రోజుల రిఛార్జ్ ప్లాన్.. రోజుకు 2.5GB డేటా, హాట్‌స్టార్, అడోబ్ ఫ్రీ .. జియో, బిఎస్ఎన్ఎల్ కంటే బెటర్

అసలు ఆ లేఖలో ఏం అన్నారంటే.. “గౌరవనీయులైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కి.. భారతీయులమైన మేము ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశానికి చెందిన వారం. సుదూర తీరాల (విదేశాల) నుంచి వచ్చే ఆదేశాలను పాటించే రోజులు ఎప్పుడో పోయాయి. మీ మాట మేము వినాల్సిన పని లేదు.. మీ పని మీరు చూసుకోండి” అని కమల్ స్పష్టం చేశారు. అమెరికా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, “దయచేసి మీ పని మీరు చూసుకోండి” అని ఆయన కటువుగా పేర్కొన్నారు. రెండు సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని, అమెరికా ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఒక గర్వించదగ్గ భారత పౌరుడిగా, మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు కమల్ హాసన్ పేర్కొన్నారు.

భారతదేశ సార్వభౌమత్వంపై కమల్ హాసన్ సూచనలు

Read also- Samuthirakani: విజయ్ పై సముద్రఖని ఘాటు వ్యాఖ్యలు.. ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా అంటూ!

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ భారత్‌కు ఈ 30 రోజుల మినహాయింపును ప్రకటించారు. అయితే, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా నుంచి పెంచుతుందని ఆశిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ తరహా ఒత్తిడిని నిరసిస్తూ కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై భారత్ ఏ చర్యను తీసుకోలుదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

To The President of the United States of America @POTUS

చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి: ప్రతిస్పందన

We, the people of India, belong to a free and sovereign nation. We no longer take orders from distant foreign shores.

Please mind your own business to the best of your abilities.

— Kamal Haasan (@ikamalhaasan) March 7, 2026

అమెరికా పెత్తనంపై కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.