|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: సుమిత్రకు ప్రాణాంతక వ్యాధి? జ్యోత్స్న మాటల తూటాలు, పోలీస్ స్టేషన్‌లో ఉత్కంఠ!

Published: 20-12-2025, 1:04 AM
కార్తీక దీపం 2: సుమిత్రకు ప్రాణాంతక వ్యాధి? జ్యోత్స్న మాటల తూటాలు, పోలీస్ స్టేషన్‌లో ఉత్కంఠ!
  • సుమిత్ర రక్తపు వాంతులు చేసుకోవడంతో కార్తీక్, దశరథ్ ఆమెను టెస్టులకు తీసుకెళ్లారు.
  • దీప గర్భం దాల్చకముందే సుమిత్ర ఆరోగ్యం బాలేదని దశరథ్ కార్తీక్‌కు వివరించాడు.
  • శ్రీధర్ అరెస్ట్‌పై ఇంట్లో అందరినీ నిందిస్తూ జ్యోత్స్న తీవ్ర వాదనలకు దిగింది.
  • జ్యోత్స్న వ్యతిరేకించినా, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కార్తీక్ తాతతో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు.

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఉత్కంఠ పెరిగింది. సుమిత్ర రక్తపు వాంతులు చేసుకోవడంతో ప్రాణాంతక వ్యాధి భయం అందరినీ వెంటాడుతోంది. శ్రీధర్ అరెస్ట్‌పై జ్యోత్స్న కోపంతో రగిలిపోగా, కార్తీక్, తాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సుమిత్రకు ప్రాణాంతక వ్యాధి భయం

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో సుమిత్ర రక్తపు వాంతులు చేసుకోవడం కార్తీక్‌కు చెబుతుంది. తనకు అని చెప్పి సుమిత్రను టెస్టులకు తీసుకెళ్తాడు దశరథ్. శ్రీధర్ అరెస్ట్ గురించి ఇంట్లో అందరికి చెబుతుంది జ్యోత్స్న. మాటల తూటాలు పేలుస్తూ రచ్చ రచ్చ చేస్తుంది జ్యోత్స్న.

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్‌కు సుమిత్ర నోటి నుంచి రక్తం పడిన విషయం గురించి చెబుతుంది దీప. అమ్మకు ఏదైనా వ్యాధి ఉందా అని భయపడుతుంది. దాంతో గురూజీ చెప్పిన గండం అత్తకేనా అని కార్తీక్ అనుమానిస్తాడు. కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ భయాలు, టెన్షన్ పడకూడదని కార్తీక్ నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.

శ్రీధర్ అరెస్ట్‌పై జ్యోత్స్న మాటల తూటాలు

దీప ప్రెగ్నెంట్ కాకముందునుంచే మీ అత్తకు ఆరోగ్యం బాలేదురా. కానీ పట్టించుకోలేదని దశరథ్ అంటాడు. ఇంతలో సుమిత్ర వస్తుంది. హాస్పిటల్‌కు ఎందుకు అని అడుగుతుంది. నీకు టెస్ట్‌లు చేయించాలని కార్తీక్ అంటాడు. వయసు వచ్చాక ఆరు నెలలకు ఓసారి టెస్ట్‌లు చేయించుకోవాలని దశరథ్ అంటాడు. నీ విషయంలో ఏ చిన్నది జరిగిన ఆయన తట్టుకోలేరు అని కార్తీక్ అంటాడు.

ఇద్దరు వెళ్తారు. దీప ఏడుస్తూ భయపడుతుంది. కార్తీక్ ఓదారుస్తాడు. ముత్యాలమ్మ తల్లి మా అమ్మకు ఏం కాకూడదు అని మొక్కుకుంటుంది. మరోవైపు సుమిత్రకు టెస్ట్‌లు చేయిస్తారు. సుమిత్రకు ఏం చెప్పనని డాక్టర్ అంటాడు. మరోవైపు శివ నారాయణ సీరియస్ అవుతాడు. ల్యాప్‌ట్యాప్‌లో అందరికి శ్రీధర్ అరెస్ట్ చూపిస్తుంది జ్యోత్స్న .

పోలీస్ స్టేషన్‌కు కార్తీక్, తాత

అంతా వాదించుకుంటారు. తాత ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని కార్తీక్ అంటే.. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి. మనకు దానికి సంబంధం లేదని చెప్పాలంటుంది జ్యోత్స్న. కార్తీక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్దామంటే సరే అని శివ నారాయణ వెళ్తాడు. తండ్రి తప్పులో బావకు కూడా భాగమున్నట్లుంది అని జ్యోత్స అంటుంది.

సుమిత్ర ఆరోగ్య పరిస్థితి, శ్రీధర్ అరెస్ట్ కేసు, కార్తీక్ తదుపరి చర్యలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. రాబోయే ఎపిసోడ్‌లలో మరిన్ని నాటకీయ మలుపులు చూడబోతున్నాం. ఈ ఉత్కంఠభరిత ఘట్టాలను మిస్ అవ్వకండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.