
కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ లో కార్తీక్, జ్యోత్స్నల మధ్య వాదోపవాదాలు, పగలు హైలైట్ అయ్యాయి. మరోవైపు, శ్రీధర్ కాశీపై ఆగ్రహం వ్యక్తం చేయగా, కార్తీక్ తన తండ్రిని మార్చే ప్రయత్నంలో ఉన్నాడని కాంచనతో చెప్పాడు. తండ్రి ఒట్టేసినా కార్తీక్ నిజం దాచాడు.
Key Points
కార్తీక్, జ్యోత్స్న మధ్య పగ, కంపెనీ నష్టాలపై తీవ్ర వాదనలు.
ఖాళీగా ఉన్న కాశీపై శ్రీధర్ గట్టిగా అరుస్తూ, హితబోధ చేశాడు.
తండ్రిని మార్చే ప్రయత్నంలో ఉన్నానని కాంచనతో కార్తీక్ నిజం చెప్పాడు.
వడ్డీ లేని అప్పు ఇప్పిస్తానన్నా తీసుకోకపోవడంపై కార్తీక్‌ను శ్రీధర్ ప్రశ్నించాడు.
కార్తీక్-జ్యోత్స్న మధ్య పగలు, మైండ్ గేమ్
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు, నేను ఒకటి కాదు మరదలా సారీ పెద్ద మేడం గారు. మీరు ఓనర్లు, మేం వర్కర్లమని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. నువ్వు దాసు మామయ్య కూతురివి నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరని లోపల అనుకుంటాడు కార్తీక్. నేను కూతురు కొడుకును, నువ్వు కొడుకు కూతురివి రెండు వేరు కదా. ఇంట్లో నా మీద పగ సాధించేది నువ్వే కదా అని కార్తీక్ అంటాడు. నా పగ నీ మీద కాదు దీప మీద అని జ్యో అంటుంది. పగలు మానేసి కంపెనీని నష్టాల్లో నుంచి బయటకు రప్పించమని కార్తీక్ అంటాడు.
మైండ్ గేమ్ లు ఏంటో తెలియకుండానే శౌర్యను అడ్డుపెట్టుకుని మమ్మీని, దీప ను అడ్డుపెట్టుకుని డాడీని మార్చాలని చూస్తున్నావ్ కదా బావ అని జ్యోత్స్న అంటుంది. ఈ తెలివి తేటలు వాడే కదా అత్తయ్య, మామయ్యను విడదీశావని కార్తీక్ అనగానే జ్యో షాక్ అవుతుంది. వేలం పాటలో మీరు విజయం సాధించాలని, తాత పరువు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కార్తీక్ చెప్పి వెళ్లిపోతాడు.
రాత్రి ఇంట్లో భోజనం చేస్తూ మీ అన్నయ్య ఆత్మాభిమానం గురించి నీకు తెలుసు కదా. కన్న తండ్రి దగ్గర ఆత్మాభిమానం కోసం ఒక్క రూపాయి తీసుకొని కొడుకు బహుశా నాకే ఉన్నాడేమో అని స్వప్నతో శ్రీధర్ అంటాడు. అప్పుడే కాశీ కుర్చీల్లో నుంచి లేస్తాడు. శ్రీధర్ ఒక్కసారిగా కూర్చోమని గట్టిగా అరుస్తాడు. నీ ప్రాబ్లెం ఏంటీ? ఎవరినీ ఏం అడగలేవు? ప్రశాంతంగా పడుకోలేవు? ఇప్పుడు నా కొడుకు గురించి చెప్తుంటే నీకు కనెక్ట్ చేసుకుని లోపల బాధపడుతున్నావని కాశీతో శ్రీధర్ అంటాడు.
కాశీపై శ్రీధర్ ఆగ్రహం: ఖాళీగా ఎందుకుంటావు?
ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావని నస పెడుతున్నానా? నీకు నచ్చినట్లు ఉండు. రెస్ట్ తీసుకో, టైమ్ తీసుకో. మంచి ఉద్యోగం చూసుకో. సంవత్సరం టైమ్ పట్టని అయితే ఏంటీ? ఫ్రీగా ఉండూ, ఫ్రెండ్లీగా ఉండు. నీలో నువ్వు ఎందుకు అల్లుడు కుమిలిపోతావు? ఉన్నది ఒకటే జీవితం. ప్రశాంతంగా బతికి చావండని కాశీకి శ్రీధర్ హితబోధ చేస్తాడు.
నువ్వు మీ నాన్నను మార్చే ప్రయత్నంలో ఉన్నావా? అని కాంచన అడిగితే నిజమేనని కార్తీక్ అంటాడు. మరి డబ్బులు ఎందుకు తీసుకోలేదు? ఏదో రకంగా ఆ ఇంట్లో నుంచి బయటపడాలని చెప్తున్నానని కాంచన అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. నీ భార్య కోసమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావ్? కానీ బయటపడే ఛాన్స్ వస్తే ఎందుకు తీసుకోలేదని శ్రీధర్ అంటాడు. వడ్డీ లేని అప్పు ఇప్పిస్తానంటాడు. ఎవరు అప్పు ఇచ్చినా తీసుకోవు అది ఎందుకో నీ భార్యకు తెలుసు కానీ చెప్పరని శ్రీధర్ అంటాడు.
అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేందుకు వేరే ఏదో కారణం ఉంది. అదేంటీ? తల్లికి చెప్పకుండా వాడు ఏ పని చేయడని శ్రీధర్ అడుగుతాడు. కార్తీక్ సమాధానం చెప్పు అని కాంచన అడుగుతుంది. ఇదే ప్రశ్న చాలా సార్లు అడిగా కానీ మాట దాటేశావని అంటుంది. ఎందుకు డ్రైవర్ గా పని చేస్తున్నాడో కార్తీక్ చెప్పాలని శ్రీధర్ గట్టిగానే అడుగుతాడు.
తండ్రి ఒట్టూ, కార్తీక్ దాచిన నిజం
కార్తీక్ ను తీసుకొని బయటకు వెళ్లి మరీ మళ్లీ అడుగుతాడు శ్రీధర్. మిమ్మల్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని ఎమోషనల్ అవుతాడు. నా స్థానంలో నువ్వుంటే నీ కొడుకు డ్రైవర్ గా పని చేస్తుంటే ఆనందంగా ఉండగలవా? అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. నేనేమో విలాసవంతంగా ఉంటున్నా కానీ నా కొడుకు పేదరికంలో బతుకుతున్నాడు. నీ జీవితాన్ని గొప్పగా ఊహించుకున్న నీ తండ్రి ఇది తట్టుకోలేడు. నువ్వు మధ్య తరగతి జీవితానికి అలవాటు పడిపోయావని శ్రీధర్ అంటాడు.
దీనంతటికి కారణం దీప. నువ్వు రోడ్డు మీదకు రావడానికి కారణం దీపను పెళ్లి చేసుకోవడమే. దీపే నీ ప్రాణాలు కాపాడింది. అలాగని నువ్వు దీప గురించి ఏం చేయలేదా? పెళ్లి చేసుకుని జీవితానికి వెలుగునిచ్చావు. తన కోసమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. డ్రైవర్ గా మారావు. కానీ ఎందుకు బయట పడటం లేదని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. దీప రుణం తీర్చుకోవడానికి అని కార్తీక్ అంటాడు.
దీప రుణం తీర్చుకోవడానికి, ఆ ఇంటికి ఏంటి సంబంధం? అని శ్రీధర్ అడిగితే, చెప్పలేనని కార్తీక్ అంటాడు. శ్రీధర్ తన మీద ఒట్టేసి నిజం చెప్పమని కార్తీక్ చేయి తీసుకుని తలమీద పెట్టుకుంటాడు. అయినా కార్తీక్ చెప్పడు. టైమ్ వచ్చాక అన్నీ తెలుస్తాయని అంటాడు. రాజ్యాన్ని వదిలేసిన రాజుకే తెలుసు మాట విలువేంటో? ప్రాణం ఇచ్చిన మనిషికి ఎంతగా రుణపడి ఉండాలని కార్తీక్ తిరిగి ప్రశ్నిస్తాడు. సంబంధం ఏంటో నేను తెలుసుకుంటానని శ్రీధర్ అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
నేటి ఎపిసోడ్ అనేక ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సాగింది. కార్తీక్ రహస్యాలు, శ్రీధర్ ఆగ్రహం, కుటుంబ కలహాలు సీరియల్‌కు మరింత ఆసక్తిని పెంచాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


