|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పెద్ద షాకే ఇచ్చిన శ్రీధర్- పెళ్లి ఆపేలా జ్యోత్స్న, పారుతో మీటింగ్- సుమిత్రను రెచ్చగొట్టేలా

Published: 21-08-2025, 9:41 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పెద్ద షాకే ఇచ్చిన శ్రీధర్- పెళ్లి ఆపేలా జ్యోత్స్న, పారుతో మీటింగ్- సుమిత్రను రెచ్చగొట్టేలా

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో పెళ్లికి ముందు అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకుంటాయి. శ్రీధర్ ఒక పెద్ద షాక్ ఇవ్వగా, జ్యోత్స్న మరియు పారిజాతం పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తారు. సుమిత్రను కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి.

Key Points

1

శ్రీధర్ పెళ్లి ఆపేందుకు ఒక ప్లాన్ వేస్తాడు.

2

జ్యోత్స్న మరియు పారిజాతం పెళ్లి గురించి ఆందోళన చెందుతున్నారు.

4

కాంచనకు శివన్నారాయణ చీర ఇచ్చి సంతోషపరుస్తాడు.

శ్రీధర్ యొక్క షాకింగ్ నిర్ణయం

కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 22వ తేదీ ఎపిసోడ్ లో పెళ్లికి ముందు మగపెళ్లివాళ్లకు బట్టలు పెట్టాలని శివన్నారాయణ అంటాడు. మిగతా వాళ్లకు మీరు పెట్టండి. ఇంటి ఆడపడుచుకు మాత్రం నేనే బట్టలు పెడతా అని శివన్నారాయణ అనగానే కాంచన సంబరపడుతుంది. కానీ ఎవరి శుభ కార్యమైనా మీ అమ్మ చీర కొనిచ్చేది. ఇది మీ అమ్మ పేరు మీద కొన్నా దశరథ అని శివన్నారాయణ అనగానే కాంచన ఆనందం ఆవిరైపోతుంది. నేనేం అనుకుని తీసుకోవాలో అని ఆలోచిస్తున్నా అని కాంచన అంటుంది.

నన్ను పెళ్లి కొడుకు తల్లి అనుకుని చీర ఇస్తే నువ్వు పాటించే పద్ధతి అవుతుంది. ఒక డ్రైవర్ తల్లికి చీర కొనిచ్చానని అనుకుంటే అది జాలి అవుతుంది. అసలు ఎవరో తెలియన మనిషికి చీర కొనిచ్చాను అనుకుంటే అది నాకిచ్చే దానం అవుతుంది. నా ఆడబిడ్డకు చీర కొనిచ్చానని అనుకుంటే ఇది నా తల్లి ఆశీర్వాదం అవుతుంది. నా తల్లి ఆఖరి ఊపిరి వదిలేసిన ఇల్లు నాన్న అంటూ కాంచన ఎమోషనల్ అవుతుంది. ఇది ఇల్లు కాదు నా తల్లి ఒడి, నా తల్లి పేరు చెప్పి ఈ చీర ఇస్తున్నావంటే నా కన్నతల్లే వచ్చి ఇచ్చినట్లు ఉంటుందని కాంచన ఏడిపించేస్తుంది.

నీది కూడా ఈ తండ్రి రక్తమనే తెలుసు. అందుకు నువ్వు ఈ తండ్రిలాగే మొండిగా ఉండాలా? అని దశరథ్ అడుగుతాడు. నాకు తండ్రి లక్షణాలే వచ్చాయి. కానీ నీది అమ్మ మనస్సు అన్నయ్య అని కాంచన అంటుంది. నీ తల్లి ఆశీర్వాదం అనుకో అని శివన్నారాయణ చీర ఇస్తాడు. చీరను గుండెలకు హత్తుకుని కాంచన సంతోషపడుతుంది. నాన్నకు నీ మీద ఏ కోసం లేదని ఇప్పటికైనా అర్థమైందా అని దశరథ్ అడుగుతాడు. సుమిత్రను పట్టుకుని కాంచన ఏడ్చేస్తుంది. ఆ సీన్ చూసి జ్యోత్స్న, పారిజాతం రగిలిపోతారు. కాంచనకు స్వీటు తినిపిస్తుంది దీప .

జ్యోత్స్న మరియు పారిజాతం యొక్క ఆందోళన

అనుకున్నామని జరగవు అన్నీ అంటూ జ్యోత్స్న ముందు కూర్చుని దీనంగా పాడుతుంటుంది పారిజాతం. మనం ఈ పెళ్లి ఆపలేమా? అని జ్యో అడుగుతుంది. ఆపలేమని పారిజాతం అంటే.. ఆపగలం అంటూ శ్రీధర్ ట్విస్ట్ ఇస్తాడు. నువ్వు కూడా మమ్మల్ని చీట్ చేస్తావని అనుకోలేదని జ్యో అంటే.. కొన్ని ఎమోషన్లకు లొంగిపోయానని శ్రీధర్ అంటాడు. అల్లుడు పార్టీ మార్చాడని పారు అంటుంది. జస్ట్ షర్ట్ మార్చాను లోపల పాత శ్రీధర్ అలాగే ఉన్నాడు. మనం ఈ పెళ్లి ఆపాలి. మన మీద నింద పడకూడదు. మనం ముగ్గురం కలిశామంటే ఐడియా వస్తుందని శ్రీధర్ చెప్తాడు.

నీ జీవితం సీఈవో పోస్టు నుంచి డ్రైవర్ పోస్టుకు రావడానికి కారణం దీప. నీకు మంచి జరగడానికి ఈ పెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నా అని కార్తీక్ గురించి మనసులో అనుకుంటాడు శ్రీధర్. శ్రీధర్, జ్యోత్స్న, పారిజాతం కలిసి పెళ్లి ఆపడానికి ఆలోచనలు పంచుకుంటారు. ముహూర్తం దాటిపోయేంతవరకూ తాళి కట్టనివ్వకుండా చూడాలని జ్యో అంటుంది. నైట్ అంతా నిద్ర మాని అయినా సరే పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించాలని పారిజాతం చెప్తుంది. దీప మెడలో బావ తాళి కట్టకూడదని జ్యో అంటుంది.

సుమిత్రను రెచ్చగొట్టే ప్రయత్నాలు

ఉదయం పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. శౌర్యతో ఆడుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. శ్రీధర్ ను చూసి చిరాకు పడతాడు. చివరి నిమిషంలో అది లేదు, ఇది లేదు అనే మాట రాకూడదు. అన్ని జాగ్రత్తగా చూసుకో అని దశరథకు చెప్తాడు శివన్నారాయణ. దీపను సుమిత్ర రెడీ చేస్తుంది. నిన్ను కనిపడేసిన తల్లి కూడా నీకింత వైభవం వస్తుందని ఊహించి ఉండదని పారు అంటుంది. సుమిత్రను దీప అలాగే చూస్తుంటే జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. ఇదంతా నా ఖర్మ అని సుమిత్ర అంటుంది. ఈ రోజు దీప పెళ్లి, ఆమెను బాధపెట్టొద్దని జ్యోత్స్న చెప్తుంది.

దీపను కన్న కూతురిలాగే చూడు. శత్రువులా చూడకు. బావతో జరగాల్సిన నా ఎంగేజ్మెంట్ దీప వల్లే ఆగిపోయింది. అది నువ్వు గుర్తు చేసుకోవద్దు. ఒక్క రోజు ఆగితే బావకు నాకు పెళ్లయ్యేది. కానీ దీప కారణంగానే ఆగిపోయింది. నీ కూతురు దీప కారణంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన కూతురును చంపబోయానని నా మీద నింద వేసింది. నన్ను కొట్టింది. నన్ను చంపాలనుకుంటే నాకు తగలాల్సిన బులెట్ డాడీకి తగిలింది. అది నువ్వు గుర్తు చేసుకోవద్దు మమ్మీ అంటూ గతాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది జ్యోత్స్న. పూలు అలంకరించమని జ్యో ఇస్తే సుమిత్ర కోపంతో నేలకేసి కొట్టడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగస్తుంది.

ఈ ఎపిసోడ్ లో చాలా ఉత్కంఠభరితమైన ఘట్టాలు చూడొచ్చు. శ్రీధర్ యొక్క నిర్ణయం పెళ్లిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.