|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kichcha Sudeep Remuneration: బిగ్‌ బాస్‌ షోకి సుదీప్‌ పారితోషికం ఎంతో తెలుసా? మొత్తం వెనక్కి ఇవ్వాల్సిందేనా?

Published: 07-10-2025, 11:20 AM
Kichcha Sudeep Remuneration: బిగ్‌ బాస్‌ షోకి సుదీప్‌ పారితోషికం ఎంతో తెలుసా? మొత్తం వెనక్కి ఇవ్వాల్సిందేనా?

దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షో కన్నడలో 12వ సీజన్‌కు చేరుకుంది. అయితే నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బిగ్‌ బాస్‌ కన్నడ షోని ఆపేశారు. ఈ నేపథ్యంలో హోస్ట్ కిచ్చ సుదీప్‌ పారితోషికంపై చర్చ మొదలైంది.

Key Points

1

బిగ్‌ బాస్‌ కన్నడ సీజన్ 12 నిబంధనల ఉల్లంఘనతో నిలిచిపోయింది.

2

కాలుష్య నియంత్రణ మండలి స్టూడియోను సీజ్ చేయడంతో కంటెస్టెంట్లను బయటకు పంపారు.

4

కిచ్చ సుదీప్‌ పారితోషికంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

బిగ్‌ బాస్‌ కన్నడ షో ఎందుకు ఆగింది?

బిగ్‌ బాస్‌ రియాలిటీ షోకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌తోపాటు శాండల్‌వుడ్‌లోనూ ఈ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇండియాలో బిగ్‌ బాస్‌ షో మొదటగా ప్రారంభమైంది హిందీలో. ఆ తర్వాత స్టార్ట్ అయ్యింది కన్నడలోనే. కన్నడలో కలర్స్ కన్నడ టీవీలో ఈ షో రన్‌ అవుతుంది. మొదటి నుంచి ఈ షోకి కన్నడ స్టార్‌ కిచ్చ సుదీప్‌ హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఇది 12వ సీజన్‌కి చేరుకుంది. ఇందులో ఓసారి మినీ సీజన్‌ నిర్వహించారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ కన్నడ సీజన్‌ 12 నడుస్తోంది.

గత వారమే `బిగ్‌ బాస్‌ కన్నడ 12` షో ప్రారంభమైంది. ఇంతలోనే పెద్ద దెబ్బ పడింది. కన్నడ బిగ్‌ బాస్‌ షోని ఆపేశారు. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 12’ షో రన్‌ అవుతున్న బిదాడిలోని జోలీవుడ్ స్టూడియోను రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి మంగళవారం సీజ్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరు సాయంత్రం 7 గంటలలోపు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) జారీ చేసిన నోటీసు తర్వాత, రెవెన్యూ శాఖ అధికారులు స్టూడియోకు చేరుకుని, పోటీదారులందరూ సాయంత్రం 7 గంటలలోపు ఇంటి నుండి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో కన్నడ బిగ్‌ బాస్‌ మూతపడే పరిస్థితి నెలకొంది. అయితే షో మొత్తం క్లోజ్‌ చేస్తారా? తాత్కాలికంగా బంద్‌ చేస్తున్నారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పర్యావరణానికి సంబంధించిన చర్యలు చేపట్టాక మళ్లీ కొనసాగుతుందా అనేది చూడాలి.

స్టూడియో సీజ్ వెనుక కారణాలు

ఇదిలా ఉంటే 19 మందితో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇందులో అభిషేక్‌, అశ్వినీ జీ, అశ్వినీ ఎస్‌, ధనుష్‌, చంద్రప్రబ, ధృవంత్‌, గిల్లి నటా, జాన్వీ, కావ్య, మంచు భాసిని, మల్లమ్మ, మాలు పీ, రక్షిత, రాషిక, స్పందన, సుధీర్‌, సతీష్‌, ఆర్‌జే అమిత్‌, కరిబసప్పా వంటి టీవీ, సినిమా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ పాల్గొన్నారు. వీరిలో మొదటి వారం ఆర్‌జే అమిత్‌, కరిబసప్పా మొదటి వారం ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఇంటికి వెళ్లిపోతున్నారు. మరి వీళ్ల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఈ షోకి కిచ్చ సుదీప్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ షో కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రారంభంలో ఈ షో కోసం ఐదేళ్లకిగానూ మొత్తంగా రూ. 20కోట్లు అని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత ఇందులో మార్పులు తీసుకొచ్చారు. దీంతో సుదీప్ పారితోషికం పెరిగింది. గత సీజన్‌కి ఆయన 9 కోట్లు పారితోషికంగా అందుకోగా, ఇప్పుడు రూ.12కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఇది మిగిలిన లాంగ్వేజెస్‌లోని హోస్ట్ ల కంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. తెలుగులో సుమారు ముప్పై కోట్ల వరకు నాగార్జున పారితోషికం తీసుకుంటున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతి రూ.75 కోట్లు తీసుకుంటున్నారట. మలయాళంలో మోహన్‌ లాల్‌ రూ.24 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ ఏకంగా రూ. 150కోట్లు బిగ్‌ బాస్‌ కోసం పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది ఈ లెక్కన సుదీప్‌ చాలా తక్కువ పారితోషికం తీసుకుంటున్నారని చెప్పొచ్చు.

కిచ్చ సుదీప్‌ పారితోషికంపై సందిగ్ధత

ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్‌ బాస్‌ కన్నడ 12 షో క్యాన్సిల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ పారితోషికం వెనక్కి ఇస్తారా? కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ షో ప్రారంభిస్తారా అనేది చూడాలి. పర్యావరణ అధికారులు, ప్రభుత్వం నిర్ణయం బట్టి ఈ షో భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఇక కిచ్చ సుదీప్‌ మన తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితమే. ఆయన `ఈగ` సినిమాలో విలన్‌గా నటించారు. దీంతోపాటు `బాహుబలి`లో కాసేపు అలరించారు. ఆ తర్వాత `సైరా నరసింహారెడ్డి`లో కీలక పాత్రలో మెరిశారు. వీటికంటే ముందు `రక్తచరిత్ర`లోనూ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు సుదీప్‌. ప్రస్తుతం కన్నడలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

బిగ్‌ బాస్‌ కన్నడ షో నిలిచిపోవడంపై అభిమానులు నిరాశలో ఉన్నారు. షో భవిష్యత్తుపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ అనిశ్చితి మధ్య, కిచ్చ సుదీప్‌ అందుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇవ్వాల్సి వస్తుందా అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.