
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Key Points
మహేష్ బాబు కొత్త లుక్ రాజమౌళి సినిమా కోసం అద్భుతంగా ఉంది.
కర్లీ హెయిర్, గుబురు గడ్డంతో సింహంలా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయం.
రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.
మహేష్ బాబు కొత్త లుక్ వైరల్
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో జక్కన్న ఈ మూవీ తీస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మహేష్ కొత్త లుక్ ఫొటోలు బయటకు వచ్చాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నెక్ట్స్ మూవీ ఎస్ఎస్ఎంబీ29 . రాజమౌళి డైరెక్షన్ లో కావడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. జనవరిలోనే పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఒడిశాలో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా మూవీ కోసం మహేష్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
SSMB29 కోసం మహేష్ బాబు సిద్ధం
మంగళవారం (ఏప్రిల్ 29) సోషల్ మీడియాలో మహేష్ కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు వచ్చాయి. ఈ రెండు ఫొటోల్లో మహేష్ కర్లీ హెయిర్, గుబురు గడ్డంతో చాలా డిఫరెంట్ గా కనిపించాడు. అతని పక్కనే భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉంది. మహేష్ షార్ట్స్, బీజ్ కలర్ టీషర్ట్ లో చాలా రిలాక్స్‌డ్ గా కనిపించాడు.
మహేష్ బాబు కొత్త లుక్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింహంలా ఉన్నాడంటూ కొందరు కామెంట్స్ చేశారు. సింహం గర్జించడానికి సిద్ధంగా ఉందంటూ ఒకరు.. ప్రపంచానికి ఓ కొత్త హాలీవుడ్ హీరో దొరకబోతున్నాడని మరొకరు కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇదే. అటు గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు ఏడాది పాటు ఖాళీగా ఉండి ఇప్పుడీ సినిమా కోసం బిజీ అయ్యాడు.
ఫ్యాన్స్ స్పందన అద్భుతం
ఇందులో ప్రియాంకా చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాను ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఇండియానా జోన్స్ మాదిరిగా ఓ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఎస్ఎస్ఎంబీ29 తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ అపజయం అంటూ ఎరుగని రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో ఏం చేయబోతున్నాడో అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఇప్పటి వరకూ అతడు తీసిన అన్ని సినిమాల కంటే భారీగా ఉండబోతోందని మాత్రం ఇప్పటికే స్పష్టమైంది.
మొత్తానికి, మహేష్ బాబు కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న SSMB29 పై అంచనాలు భారీగా ఉన్నాయి.


