|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మానస శర్మ ప్రేమ వ్యవహారంపై సంచలన నిజాలు! ఆ హీరోతో బ్రేకప్ వెనుక అసలు కథేంటి?

Published: 07-04-2026, 6:35 AM
మానస శర్మ ప్రేమ వ్యవహారంపై సంచలన నిజాలు! ఆ హీరోతో బ్రేకప్ వెనుక అసలు కథేంటి?
  • దర్శకురాలు మానస శర్మ ‘రాకాస’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.
  • ఆమె గతంలో ఐఏఎస్ కోసం ప్రయత్నించారు, కానీ సినిమాపై ఆసక్తితో దర్శకురాలిగా మారారు.
  • సంగీత్ శోభన్ తో పరిచయం స్నేహంగా మిగిలిపోయింది అని మానస తెలిపారు.
  • సంతోష్ శోభన్ తో ఆమె ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ దర్శకురాలు మానస శర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఆమె రాకాస సినిమాతో విజయం సాధించడంతో పాటు, హీరో సంతోష్ శోభన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల్లో నిజమెంతో తెలుసుకుందాం.

మానస శర్మ సినీ ప్రస్థానం

Manasa Sharma: ప్రముఖ లేడీ డైరెక్టర్ మానస శర్మ(Manasa Sharma) .. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. ఇటీవల దర్శకురాలిగా తొలిసారి వెండితెరకు పరిచయమవుతూ.. రాకాస సినిమాతో ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. తన దర్శకత్వపు మెలకువలతో.. అద్భుతమైన విజువలైజేషన్ తో సినిమాను తెరకెక్కించి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది. సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకురాలిగా తొలి ప్రయత్నం లోనే మంచి సక్సెస్ అందుకున్న మానసకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయిన మానస శర్మ ఐఏఎస్ కావడానికి దాదాపు ఆరు సంవత్సరాల పాటు కష్టపడింది. అయితే ఐఏఎస్ ప్రిపరేషన్ లో చరిత్ర గురించి చదివిన ప్రతిసారి ఆమెకు సినిమా గురించే ఆలోచన వచ్చేదట. ఇక దాంతో ఎలాగైనా తన ఆలోచనలకు రూపం దాల్చాలి అనుకున్న ఆమె నిహారిక ప్రొడక్షన్ కంపెనీలో ‘మ్యాడ్ హౌస్’ అనే యూట్యూబ్ సీరీస్ కి రైటర్గా పనిచేసింది. ఆ తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి క్రియేటర్ గా, రచయితగా మారి తనలోని క్రియేటివిటీని నిరూపించుకున్న మానస ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్ తో దర్శకురాలిగా మారి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రాకాస సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మానస శర్మ.. తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అయిందని చెప్పవచ్చు.అలా ప్రస్తుతం ఎక్కడ చూసినా మానస శర్మ పేరు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె గురించిన పాలు విషయాలు వైరల్ అవ్వగా.. అందులో ఒకటి ఆమె ప్రేమ విషయం. ఒక హీరోతో దాదాపు 6 సంవత్సరల పాటు ప్రేమాయణం కొనసాగించిందట. అయితే అది మధ్యలోనే బ్రేకప్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం ..

సంగీత్ శోభన్ తో పరిచయం

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాకాస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంగీత్ శోభన్ తో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సినిమా (2021) సమయం నుంచే పరిచయం ఏర్పడిందని, తనతో ఉన్న ఆ పరిచయం మరింత పెరిగిందని, అందుకే సంగీత్ శోభన్ ను తాను కొడుకులా భావిస్తానని ఇటీవల సోషల్ మీడియా వేదికగా మానస శర్మ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో సంగీత్ శోభన్ అన్నయ్య ప్రముఖ హీరో సంతోష్ శోభన్ తో మానస ప్రేమలో ఉందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఆరు సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కానీ ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి..

సంతోష్ శోభన్ తో ప్రేమాయణం – నిజమెంత?

అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ గతంలో ఈమె సంతోష్ శోభన్ తో ప్రేమలో ఉందని , అందుకే సంతోష్ తమ్ముడిని ఒక కొడుకులా భావిస్తున్నానని ఇటీవల చెప్పింది అంటూ కొంతమంది నెటిజన్లు రూమర్లు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా మానస శర్మకు సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరి నిజంగానే ఆమె సంతోష్ శోభన్ తో ప్రేమలో పడిందా ? లేక ఇదంతా కేవలం గాసిప్ మాత్రమేనా? అనే విషయం తెలియాలి అంటే కాలమే నిర్ణయించాలి.

మానస శర్మ, సంతోష్ శోభన్ ల మధ్య ప్రేమ ఉందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.