|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంచు విష్ణు ‘ఢీ’ మూవీ రీరిలీజ్: డైరెక్టర్ ట్వీట్ వైరల్

Published: 03-06-2025, 4:39 AM
మంచు విష్ణు ‘ఢీ’ మూవీ రీరిలీజ్: డైరెక్టర్ ట్వీట్ వైరల్

రీరిలీజ్ ట్రెండ్‌లో భాగంగా, మంచు విష్ణు నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఢీ’ జూన్ 6న మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శ్రీను వైట్ల ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Key Points

1

మంచు విష్ణు ‘ఢీ’ మూవీ జూన్ 6న రీరిలీజ్.

2

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైంది.

4

రీరిలీజ్‌తో సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహం.

‘ఢీ’ మూవీ రీరిలీజ్ డేట్ ప్రకటన

గత కొద్ది రోజుల నుంచి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ నిర్మాతలకు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతుంది. అయితే గతంలో ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా రీరిలీజ్‌లో బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. దీంతో స్టార్ హీరోల సినిమాలను మూవీ మేకర్స్ మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. నిత్యం పలు చిత్రాలు రీరిలీజ్ అవుతూ ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతున్న విషయం తెలిసిందే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ థియేటర్స్‌కు వచ్చి ఆల్ టమ్ రికార్డ్‌తో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా, ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు (manchu vishnu)సూపర్ హిట్ మూవీ ‘ఢీ’ రీరిలీజ్ కాబోతున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ జూన్ 6న మరోసారి థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.

శ్రీను వైట్ల(Sreenu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు సరసన జెనీలియా హీరోయిన్‌గా నటించగా.. శ్రీహరి, బ్రహ్మానందం(Brahmanandam), సునీల్, జయప్రకాష్ రెడ్డి (Jayaprakash Reddy)కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ చిత్రం 2007లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే పలువురు సినీ స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్స్‌లోకి రానుంది.

చిత్ర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

రీరిలీజ్‌పై ప్రేక్షకుల ఆసక్తి

మంచు విష్ణు ‘ఢీ’ సినిమా రీరిలీజ్ తో సినీ ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు. ఈ రీరిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.