
📌 Key Points
- సినిమా వాళ్ళు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి.
- హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకుంటేనే సినిమాలు విడుదల చేయాలనడం ఎంతవరకు సమంజసమని మంచు విష్ణు ప్రశ్నించారు.
- ఎన్నికల నామినేషన్‌కు ముందు రాజకీయ నాయకులు కూడా టెస్టులు చేయించుకోవాలని మంచు విష్ణు సెటైర్ వేశారు.
- రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ.. మేము డ్రగ్ టెస్టులు, మీరు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినిమా వాళ్ళు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై సినీ నటుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. రాజకీయ నాయకులు కూడా పరీక్షలు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
డ్రగ్స్ టెస్టులపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Manchu Vishnu: రాష్ట్ర రాజకీయాలలో ఈ మధ్యకాలంలో చర్చనీయాంశంగా మారుతున్న ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఇప్ప పువ్వు సారా అంశంపై వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ నియంత్రణపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. జడ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినిమా వాళ్ళను టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ సమస్యపై కీలక సూచనలు చేయడం ఇప్పుడు పలువురు సెలబ్రిటీలకు ఆగ్రహానికి గురిచేస్తోంది.
ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. “హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి. యూరిన్ టెస్ట్ ద్వారా 14 రోజుల వరకు మాత్రమే సమాచారం తెలుస్తుంది కానీ వెంట్రుకల పరీక్ష ద్వారా 90 రోజుల వరకు డ్రగ్స్ వినియోగం మనం తెలుసుకోవచ్చు అంటూ వివరించారు. ముఖ్యంగా హీరోలు స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకొని ప్రజలలో అవగాహన కల్పిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. డ్రగ్స్ టెస్ట్ చేసిన వారికే సినిమాల విడుదల అనుమతి ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ సంస్కృతికి కేంద్రంగా మారుతోందన్న ఆరోపణలు ఉన్నాయి అంటూనే వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇక ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగానే స్పందించారు. కేవలం సినీ నటులనే టార్గెట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నామినేషన్‌కు ముందు రాజకీయ నాయకులు కూడా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలని సెటైర్ వేశారు. హీరోలు టెస్టులు చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయాలనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిందని విష్ణు పేర్కొన్నారు.
మండిపడ్డ మంచు విష్ణు.. ప్రశ్నల వర్షం
ఇకపోతే ఈ విషయంపై అటు రాహుల్ రామకృష్ణ కూడా ప్రశ్నించారు. హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ.. అర్జెంటుగా జీవో జారీ చేస్తే అందరం కలిసి చేయించుకుందాం.. మేము డ్రగ్ టెస్టులు.. మీరు లై డిటెక్టర్ టెస్టులు.. ప్రతి ఆదివారం పెట్టుకుందాం.. ఈ గొప్ప కార్యక్రమం.. అప్పుడే మీ మాట, మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు అంటూ రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా స్పందించారు.
డ్రగ్స్ అనేది సమాజానికి ఒక పెద్ద శాపం అనడంలో సందేహం లేదు. అయితే, కేవలం ఒక రంగాన్నే టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బాధ్యతాయుతమైన సూచన చేశారా లేక వివాదాస్పదంగా మాట్లాడారా అనే చర్చ ఒకవైపు నడుస్తుంటే, రాహుల్ రామకృష్ణ,విష్ణు అడిగిన లై డిటెక్టర్ ప్రశ్న నాయకుల నైతికతను ప్రశ్నించేలా ఉంది. ఇక ఏదేమైనా, ఈ సవాళ్లు ప్రతిసవాళ్లు చివరకు ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉపయోగపడితే మంచిదే. మరి ఎమ్మెల్యే గారు ఈ లై డిటెక్టర్ సవాల్‌పై ఎలా స్పందిస్తారో చూడాలి.
రాహుల్ రామకృష్ణ సవాల్.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా?
Now just wondering — what’s the equivalent test before filing a nomination for elections?
I am sure the voters would be happy to collaborate on a common framework with the respected MLA. https://t.co/svIOvfxkOu
— Vishnu Manchu (@iVishnuManchu) March 31, 2026
మొత్తానికి డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, మంచు విష్ణు, రాహుల్ రామకృష్ణ వంటి నటులు ఆయనకు గట్టిగా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.


