|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా సినిమాలో పాట పాడిన సింగర్ మంగ్లీ.. మనసుల్ని కదిలించే ‘కాపాడు దేవా’ సాంగ్ రిలీజ్

Published: 10-08-2025, 8:49 PM
హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా సినిమాలో పాట పాడిన సింగర్ మంగ్లీ.. మనసుల్ని కదిలించే ‘కాపాడు దేవా’ సాంగ్ రిలీజ్

హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా నటించిన ‘ఏలుమలై’ సినిమా నుండి ‘కాపాడు దేవా’ అనే కదిలించే పాట విడుదలైంది. ప్రముఖ గాయని మంగ్లీ ఈ పాటను ఆలపించారు. సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Key Points

1

రక్షిత సోదరుడు రాన్నా హీరోగా 'ఏలుమలై' సినిమాతో డెబ్యూ

2

మంగ్లీ ఆలపించిన 'కాపాడు దేవా' సాంగ్ విడుదల

4

తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల

‘ఏలుమలై’ సినిమా విశేషాలు

హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయం కాబోతోన్నారు. రాన్నా హీరోగా తెరకెక్కిన సినిమా ఏలుమలై. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఆచార్ చేయగా.. సీనియర్ హీరో జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించారు. తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి ఏలుమలై సినిమాకు దర్శకత్వం వహించారు.

నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు.

ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్, పాటలు ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఏలుమలై చిత్రం నుంచి గుండెల్ని మెలిపెట్టి, మనసుల్ని కదిలించే పాట కాపాడు దేవా సాంగ్‌ను విడుదల చేశారు.

‘కాపాడు దేవా’ పాట వివరాలు

సింగర్ మంగ్లీ ఆలపించిన ‘కాపాడు దేవా’ అనే పాట శ్రోతల మనసుల్ని కదిలించేలా ఉంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీ బాగుంది. ఈ పాటను కంపోజ్ చేసిన తీరు, లిరిక్స్‌ను గమనిస్తే.. ఓ ప్రేమ జంట, విడిపోయే క్షణాలు, ఆ దేవుడు ఆడే ఆటని చూపించినట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటికే సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట యూట్యూబ్‌ లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది.

సినిమా విడుదల తేదీ

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఏలుమలై రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా, రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబుతో పాటు ఏలుమలై సినిమాలో నాగభరణ, కిశోర్ కుమార్, సర్దార్ సత్య, జగప్ప తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే, బ్యూటిపుల్ హీరోయిన్ రక్షిత తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. రవితేజ ఇడియట్ సినిమాతో పూరి జగన్నాథ్ ఇంట్రడ్యూస్ చేసిన రక్షిత ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసింది. వాటిలో శివమణి సినిమా బాగా పేరు తీసుకొచ్చింది. తర్వాత తెలుగులో అంతగా సినిమాలు చేయని రక్షిత తమిళంలో అధిక మూవీస్‌తో అలరించింది.

మొత్తానికి, ‘ఏలుమలై’ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘కాపాడు దేవా’ పాట విజయం సినిమాకు మరింత ఆకర్షణను తెస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ వెల్లడి కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.