
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సినిమాను చూసిన తర్వాత మంచు మనోజ్ ఇచ్చిన రివ్యూ, దానికి విష్ణు ఇచ్చిన ప్రతిస్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Key Points
మంచు విష్ణు నటించిన "కన్నప్ప" సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.
మంచు మనోజ్ సినిమాను చూసి, ప్రశంసలు కురిపించారు, ముఖ్యంగా క్లైమాక్స్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
మనోజ్ రివ్యూపై విష్ణు ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉంది.
విష్ణు, మనోజ్ మధ్య గొడవల నేపథ్యంలో ఈ రివ్యూ మరియు ప్రతిస్పందన ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కన్నప్ప సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చిత్రంలో విష్ణుతో పాటు ప్రభాస్, ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండటంతో కన్నప్ప క్రేజ్ మరింత పెరిగింది. ఇక చాలా కాలం తరవాత హిట్ పడటంతో ఆయన ఫుల్ కుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కన్నప్ప సినిమా చూసిన తరవాత మంచు మనోజ్ రివ్యూ ఇచ్చారు.
సినిమా చాలా బాగుందని అన్నారు. క్లైమాక్స్ ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు బాగుందని చెప్పారు. క్లైమాక్స్ లో అద్భుతంగా నటించారని అన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఇక సినిమా విడుదలకు ముందు కన్నప్పలో నటించిన మోహన్ బాబు, విష్ణు పిల్లల ఫోటోలు షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కానీ హీరోగా నటించిన విష్ణు పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. గత కొద్ది రోజులుగా విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ రివ్యూపై ఇంటర్వ్యూలో విష్ణును ప్రశ్నించారు. దీంతో విష్ణు సినిమా బాగుందని చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. అతను కూడా మనోజ్ పేరు ఎత్తకుండా ప్రతిఒక్కరికీ థాంక్స్ అంటూ ఆ సంభాషణకు పులిస్టాప్ పెట్టారు.
మనోజ్ రివ్యూ: క్లైమాక్స్ అద్భుతం!
విష్ణు ప్రతిస్పందన: కృతజ్ఞతలు
మనోజ్ రివ్యూ మరియు విష్ణు ప్రతిస్పందన కన్నప్ప సినిమా చుట్టూ ఉన్న ఉత్సుకతను మరింత పెంచాయి. సినిమా విజయం, వారిద్దరి మధ్య సంబంధం ఈ ఘటనకు కీలకం.


